
మలయాళ నటుడు టొవినో థామస్ ప్రధాన పాత్రలో నటించిన పవర్ ఫుల్ థ్రిల్లర్ మూవీ ‘నరివెట్ట’. ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అవుతోంది. ఈ చిత్రం 2025 మే 23న థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రెండు నెలల తర్వాత జూలై 11, 2025న సోని లివ్(SonyLiv) ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్‌కి రానుంది. ఈ విషయాన్ని అధికారికంగా సోని లివ్ సంస్థ ప్రకటించింది. మలయాళీ థ్రిల్లర్ చిత్రాలకు అన్ని భాషల్లో ఓటీటీలో మంచి డిమాండ్ ఉంది. మలయాళీ చిత్రాలని తెలుగు ప్రేక్షకులు కూడా బాగా అలరిస్తున్నారు. టొవినో థామస్ కి ఓటీటీ కారణంగా తెలుగు ఆడియన్స్ లో కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఈ నేపథ్యంలో నరివెట్ట ఓటీటీలో రిలీజ్ అవుతుండడం ఆసక్తిగా మారింది.
అనురాజ్ మనోహర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆదివాసీల భూ ఉద్యమం చుట్టూ తిరిగే కథతో రూపొందింది. రాష్ట్ర ప్రభుత్వ చర్యల ఆలస్యానికి వ్యతిరేకంగా ఆదివాసీలు నిర్వహించిన నిరసనలు, వాటిపై పోలీస్ చర్యలు, దాని నేపథ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలే ఈ కథకు ప్రధానాంశం.
ఈ చిత్రంలో టొవినో థామస్ CPO వర్గీస్ పాత్రలో నటించాయారు. వయనాడ్‌లో జరుగుతున్న ఉద్యమంపై వర్గీస్, అతని టీం ఎలా స్పందించిందన్నదే కథాంశం. సురాజ్ వెంజరమూడు, తమిళ దర్శకుడు-నటుడు చెరన్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. మహిళా ప్రధాన పాత్రల్లో ఆర్య సలీం ఓ ఉద్యమకారిణి CK శాంతిగా, అలాగే ప్రియంవద కృష్ణన్.. వర్గీస్ ప్రేమికురాలిగా కనిపించనున్నారు.
చిత్రకథను రచించిన అబిన్ జోసెఫ్, సమాజంలోని అసమానతలపై ప్రశ్నించేందుకు ఈ కథను మన్నించదగిన గాథగా మార్చారు. గ్రామీణ నేపథ్యం, ఆదివాసీ హక్కులు, అధికార వ్యవస్థల తీరుపై విశ్లేషణాత్మకంగా చిత్రీకరించిన ఈ చిత్రం మలయాళ పరిశ్రమలో ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.‘నరివెట్ట’ ఓటీటీ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు జూలై 11, 2025 నుండి SonyLiv వేదికగా స్ట్రీమింగ్‌కి అందుబాటులో ఉంటుంది. తెలుగులో ఈ చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించవచ్చు.