ఎలిఫెంట్ విష్పరర్స్ ఏనుగులతో ప్రధాని మోదీ, మావాటి దంపతులను అభినందించిన ప్రధాని

Published : Apr 10, 2023, 09:24 PM ISTUpdated : Apr 10, 2023, 09:27 PM IST
ఎలిఫెంట్ విష్పరర్స్ ఏనుగులతో  ప్రధాని మోదీ, మావాటి దంపతులను అభినందించిన ప్రధాని

సారాంశం

ఆస్కార్ సాధించిన  ఎలిఫెంట్ విష్పరర్స్ ఏనుగులతో సరదాగా సమయం గడిపారు ప్రధాని నరేంద్ర మోది.  సినిమాలో నటించిన మావాటి దంపతులను ప్రధాని అభినందించారు.   

మూడుమలై టైగర్ రిజర్వ్‌ ను సందర్శించారు ప్రధాని నరేంద్ర మోది. అంతే కాదు అక్కడే ఉన్న ఆస్కార్ విన్నింగ్ ఎలిఫెంట్ విష్పరర్స్ ఏనుగులను సందర్శించి కాసేపు వాటితో సమయం గడిపారు.. ఆ ఏనుగులతో  ఆడుకున్నారు. వాటితో పాటు అక్కడ ఉన్న మరికొన్ని ఏనుగులతో కూడా మోదీ సరదాగా గడిపారు. ఆ ఏనుగులని ప్రేమగా నిమిరారు. అలాగే అక్కడే ఉన్న ఎలిఫెంట్ విష్పరర్స్ లో నటించిన ఏనుగు కాపరులు.. మావాటి దంపతులు..  బొమ్మన్, బెల్లిలను కూడా కలిసి  అభినందించారు మోదీ. 

ఇక ఆ ఏనుగులతో... వాటిమావాటీలతో కలిసి సమయం గడపడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ప్రధాని. వారితో దిగిన ఫోటోలను మోదీ తన సోషల్ మీడియాలో షేర్ చేసి సంతోషాన్ని అభిమానులతో పంచున్నారు. . ఏనుగులతో మోదీ ఆడుకుంటున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

 

రీసెంట్ గా ఆస్కార్  వేడుకల్లో అనూహ్యంగా మన ఆర్ఆర్ఆర్ తో పాటు  ఇండియా నుంచి ది ఎలిఫెంట్ విష్పరర్స్.. సినిమా కూడా ఆస్కార్ గెలుచుకుంది. అందరిని ఆశ్చర్యపరిచింది. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరిలో ది ఎలిఫెంట్ విష్పరర్స్ సినిమా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. దీంతో అవార్డు అందుకున్న నిర్మాత గునీత్ మోంగా, డైరెక్టర్ కార్తీకి గొంజాల్వేస్ లను అందరూ అభినందిస్తున్నారు. వీరితో పాటు ఈ సినిమాలో నటించిన రియల్ ఏనుగులు, రియల్ ఏనుగు కాపరులు బొమ్మన్ , బెల్లిలను కూడా దేశవ్యాప్తంగా అభినందనలు అందుకున్నారు. 

ఇక ఈసినిమాల్ నటించిన నిజమైన మావటీలు బొమ్మన్, బెల్లిలు ఇప్పటికే ఎన్నో సత్కారాలు అందుకున్నారు. ఈదంపతులను ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి స్టాలిన్ సత్కరించి.. కోటి రూపాయల  రివార్డుని కూడా అందించారు. ఆ ఏనుగులకు మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో పాటు.. వాటి కోసం ప్రత్యేకంగా నిథిని కూడా ఏర్పాటు చేశారు స్టాలిన్.  ఇక తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ బందిపూర్ టైగర్ రిజర్వ్‌, మూడుమలై టైగర్ రిజర్వ్‌ లను సందర్శించి  ఆ ఏనుగులతో టైమ్ గడపడంతో.. వాటి క్రేజ్ ఇంకా పెరిగిపోయింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి