నన్ను ఆలయంలోకి వెళ్లకుండా అక్కడి సిబ్బంది ఆపేశారు. అలాగే వాళ్ళు నన్ను కొన్ని సర్టిఫికెట్స్ చూపించమన్నారు.
సినిమాలకు బ్రేక్ ఇచ్చి వివాహం చేసుకొని ఫ్యామిలీతో హ్యాపీగా గడిపేస్తోంది నమిత. తన అభిమానులకు ఆమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియా తో టచ్ లో ఉంటోంది. అక్కడ ఆమె చాలా యాక్టివ్ గా ఉంటోంది. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా నమితకు ఊహించని సంఘటన ఎదురైంది. ఆమెను ఓ దేవాలయంలోకి అనుమతించలేదు. అలాగే దేవాలయ సిబ్బంది ఆమెతో అమర్యాదకరంగా వ్యవహరించారని ఆమె తెలిపింది. ఈ క్రమంలో ఆమె ఓ వీడియో షేర్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాతో పాటు ఫిలిం సర్కిల్స్ లోనూ వైరల్ గా మరి చక్కర్లు కొడుతున్నాయి.
వీడియోలో నమిత మాట్లాడుతూ.. ‘కృష్ణాష్టమి అవ్వడంతో నేను నా కుటుంబంతో కలిసి మీనాక్షి అమ్మవారి దేవాలయానికి వెళ్లా.. అక్కడ నాకు ఓ ఊహించని సంఘటన ఎదురైంది.నన్ను ఆలయంలోకి వెళ్లకుండా అక్కడి సిబ్బంది ఆపేశారు. అలాగే వాళ్ళు నన్ను కొన్ని సర్టిఫికెట్స్ చూపించమన్నారు. దాంతో నేను షాక్ అయ్యా.. వాళ్ళు నన్ను అలా ఆపడం, సర్టిఫికెట్స్ చూపించమనడం నన్ను చాలా బాధపెట్టింది.
తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఎన్నో ప్రముఖ ఆలయాలకు తాను వెళ్ళాను ఎప్పుడు ఇలా జరగలేదు అని తెలిపింది నమిత. తనతో అమర్యాదగా వ్యవహరించిన సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరకుంటున్నా అని చెప్పుకొచ్చింది నమిత. అయితే నమిత కామెంట్స్ పై ఆలయ అధికారులు స్పందించారు.
‘‘నమితతో ఎవరూ అమర్యాదకరంగా వ్యవహరించలేదు. ఆలయ నియమాల ప్రకారమే ఆమెతో మాట్లాడాం. పై అధికారులు చెప్పడంతో కొంత సమయం ఆగమని చెప్పాం. తర్వాత ఆమెను దేవాలయంలోకి అనుమతించాం’’ అని తెలిపారు.