బాలయ్యకు సర్పైజ్ ఇవ్వబోతున్న పవన్ కళ్యాణ్, మూమూలుగా ఉండదు

By Surya Prakash  |  First Published Aug 26, 2024, 4:15 PM IST

 ఏపీ ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం హోదాలో అధికారికంగా పవన్ కళ్యాణ్ వస్తారనగానే చాలా ఆనందపడుతున్నారు.
 


కొన్ని కాంబినేషన్ లు జరిగినా జరగకపోయినా వినటానికి వినసొంపుగా, ఎగ్జైంటింగ్ గా ఉంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి బాలయ్య, పవన్ కళ్యాణ్ కాంబినేషన్. అయితే వీళ్లిద్దరుని ఒకే సారి చూపెట్టాలంటే అందుకు తగ్గ కథ ఉండాలి. ఇద్దరినీ జస్టిఫై చేయగలిగేలా ఉండాలి. ఇద్దరినీ డీల్ చేసే డైరక్టర్ కావాలి. కాని ఇప్పుడున్న సిట్యువేషన్ లో అది జరిగే  పని కాదు. అయితే ఇద్దరినీ ఒకేసారి స్టేజిపై చూడాలనే అభిమానులు కోరిక మాత్రం తీరేలా కనపడుతోంది. అదెలా అంటే..

 తెలుగు సినీ పరిశ్రమ తరపున పలు యూనియన్స్ కలిసి హైదరాబాద్ లో ఘనంగా బాలయ్య 50 ఏళ్ళ నట ప్రస్థానం వేడుకలని 1 సెప్టెంబరు 2024న చేయబోతున్నారు. దీంతో ఈ వేడుకపై టాలీవుడ్ తో పాటు బాలకృష్ణ అభిమానులకు ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. బాలకృష్ణ 50 ఏళ్ళ నట ప్రస్థానం వేడుకలు కావడంతో చాలామంది సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కాబోతున్నారు.

Latest Videos

ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు కూడా వస్తారని సమాచారం. దీంతో ఇప్పుడు మరో ఆసక్తికర చర్చ నడుస్తుంది. బాలకృష్ణ 50 ఏళ్ళ నట ప్రస్థాన వేడుకలకు పవన్ కళ్యాణ్ కూడా పిలిచారు. అందుకు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా వస్తానని చెప్పారని తెలుస్తోంది.. సినీ పరిశ్రమ నుంచి చిరంజీవి, నాగార్జున, వెంకటేష్.. ఇలా బాలయ్యతో సమానంగా ఉన్న స్టార్ హీరోలు టాలీవుడ్ నుంచి వస్తారో రారో అనుకున్నా ఏపీ ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం హోదాలో అధికారికంగా పవన్ కళ్యాణ్ వస్తారనగానే చాలా ఆనందపడుతున్నారు.
 
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు,తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా  వచ్చే అవకాశాలు 100 శాతం ఉండటంతో ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ కూడా రావొచ్చని తెలుస్తుంది. రీసెంట్ గా  ఎన్నికల ముందు నుంచి బాలయ్య, పవన్ బాగా క్లోజ్ అయ్యారు. కలిసి ప్రచారం చేశారు, బాలయ్య అన్‌స్టాపబుల్ ఈవెంట్ కి పవన్ వచ్చారు. దీంతో మరోసారి పవన్ బాలయ్య కోసం వస్తారనగానే ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.  ఈ ఇద్దర్ని ఒకే స్టేజిపై ఇంకోసారి చూడొచ్చు. అలాగే  బాలయ్య గురించి పవన్ మాట్లాడతారు అని అటు నందమూరి ఫ్యాన్స్ ఇటు మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ ఈవెంట్లో టాలీవుడ్ స్టార్ హీరోలు వచ్చినా, డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ వచ్చినా బాలయ్య 50 ఏళ్ళ నట ప్రస్థాన వేడుకలు ఫ్యాన్స్ కి స్పెషల్ గా గుర్తుండిపోవడం ఖాయం. అలాగే ఈ ఈవెంట్ కు  ప్రభాస్, చిరంజీవి కూడా వస్తారని తెలుస్తోంది. 

ఇక నందమూరి బాలకృష్ణ 1974 సంవత్సరంలో ఆగస్టు 30న విడుదలైన తాతమ్మ కల సినిమాతో తన సినీ కెరీర్‌ను హీరోగా ప్రారంభించి, హీరోగా తన కెరీర్‌లో 50 ఏళ్ల తర్వాత కూడా సినిమా ఇండస్ట్రీలో హ్యాట్రిక్ హిట్లతో హీరోగా కొనసాగుతున్నాడు. ఆయన గోల్డెన్ జూబ్లీ సినీ హీరో. రాజకీయ రంగంలో ఆయన వరుసగా మూడు పర్యాయాలు ఏపి శాసనసభకు ఎన్నికై హిందూపూర్ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించారు.

ఇప్పుడు సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్న హైదరాబాద్‌లోని బసవ తారకం ఇండో -బ్రిటీష్ క్యాన్సర్ హాస్పిటల్‌కు ఆయన చైర్మన్‌గా ఉన్నారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ తన సినీ కెరీర్‌ను 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా  సెప్టెంబరు 1న తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆయనకు సన్మానం చేయబోతోంది. భారతీయ సినిమా, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఈ సన్మాన సభలో పాల్గొంటారు.  

click me!