నారా రోహిత్‌ కమ్‌ బ్యాక్‌ ఫిల్మ్ `ప్రతినిధి2` టీజర్‌.. ఓటేయకపోతే దేశం వదిలి పారిపోండి అంటూ వార్నింగ్‌..

Published : Mar 29, 2024, 12:57 PM ISTUpdated : Mar 29, 2024, 12:58 PM IST
నారా రోహిత్‌ కమ్‌ బ్యాక్‌ ఫిల్మ్ `ప్రతినిధి2` టీజర్‌.. ఓటేయకపోతే దేశం వదిలి పారిపోండి అంటూ వార్నింగ్‌..

సారాంశం

నారా రోహిత్‌ ఒకప్పుడు హీరోగా అలరించారు. ఆ తర్వాత డౌన్‌ అయ్యాడు. ఇప్పుడు మళ్లీ కమ్‌ బ్యాక్‌ అవుతున్నాడు. `ప్రతినిధి2`తో వస్తున్నారు. తాజాగా టీజర్‌ విడులైంది.  

నారా రోహిత్‌ ఒకప్పుడు హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు, ప్రారంభంలో విజయాలు అందుకుని దూకుడు ప్రదర్శించారు. కానీ ఆ తర్వాత ఆయన్ని వరుస పరాజయాలు వెంటాడాయి. దీంతో ఏకంగా సినిమాల నుంచే వెళ్లిపోయారు. బ్రేక్‌ తీసుకున్నారు. దాదాపు ఐదారేళ్ల తర్వాత మళ్లీ కమ్‌ బ్యాక్‌ అవుతున్నారు. తనకు బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని అందించి, గుర్తింపు తెచ్చిన `ప్రతినిధి` మూవీకి సీక్వెల్‌తో వస్తున్నాడు. ఇప్పుడు `ప్రతినిధి2` చిత్రంలో నటించాడు. 

ఈ మూవీ టీజర్‌ని తాజాగా విడుదల చేశారు. చిరంజీవి చేతుల మీదుగా ఈ టీజర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా టీమ్‌కి ఆయన అభినందనలు తెలిపారు. మరి టీజర్‌ని చూస్తే, ఇందులో ప్రారంభంలో నారా రోహిత్‌ ఎంట్రీ చూపిస్తూ, రాజకీయ నాయకుడైనా సచిన్‌ ఖేడ్కర్ ద్వారా రాజకీయాలు చెప్పించారు. జనం కోసం బతికితే చచ్చాక కూడా జనంలో బతికే ఉంటాం అని చెప్పగా, పైన కూర్చొని ఎన్నైనా చెబుతారు నీతులు, మేం ఖర్చుపెట్టిందంతా ఎవరు ఇస్తారు, ఆడా ఆడమ్మ మొగుడా అని రఘుబాబు పాత్ర చెప్పగా, ఆ తర్వాత ఓ డిబేట్‌లో రాజకీయ నాయకుడైనా అజయ్‌ ఘోష్‌ని.. `మన రాష్ట్రం అప్పు ఎంతుంటుంది సర్‌` అని రిపోర్టర్‌గా నారా రోహిత్‌ ప్రశ్నిస్తాడు. 

దీనికి ఆయన స్పందిస్తూ, సుమారు ఓ ఐదు లక్షల కోట్లు ఉండొచ్చు అని ఆయన చెప్పగా, అంత అప్పు తీర్చాలంటే ఎంత టైమ్‌ పడుతుందని నారా రోహిత్‌ ప్రశ్నించగా, అభివృద్ధి ఉంటే అది ఎంత సేపు అబ్బా అని అజయ్‌ ఘోష్‌ చెప్పగా, అభివృద్ధి ఎక్కడుంది సర్‌ అని ప్రశ్నించడం ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తుంది. చివరగా `ఇప్పటికైనా కళ్లు తెరవండి, ఒళ్లు విరిచి బయటకు వచ్చి ఓటు వేయండి, లేదంటే ఈ దేశం వదిలి వెళ్లిపోండి, అది కుదరకపోతే చచ్చిపోండి` అని నారా రోహిత్‌ వార్నింగ్‌ ఇవ్వడం ఆకట్టుకుంది. మొత్తం రాజకీయం చుట్టూ ఈ మూవీ సాగుతుందని టీజర్‌ని బట్టి అర్థమవుతుంది. రాజకీయ అవినీతి చర్చించేలా సినిమా సాగుతుందని, ఒక జర్నలిస్ట్ గా, జనం ప్రతినిధిగా నారా రోహిత్‌ లీడర్ల బండారాలు బట్టబయలు చేసే పాత్రలో కనిపిస్తున్నారు. మరి ఆయనకు హిట్‌ ఇచ్చి మంచి కమ్‌ బ్యాక్‌ మూవీ అనిపిస్తుందా అనేది చూడాలి. 

నానా రోహిత్‌ హీరోగా కమ్‌ బ్యాక్‌ అవుతున్న ఈ చిత్రానికి మూర్తి దేవగుప్తపు(టీవీ5 మూర్తి) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూఈవని కుమార్‌ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్‌ బొల్లినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎలక్షన్లని టార్గెట్‌ చేస్తూ ఈ మూవీని తెరకెక్కించినట్టు తెలుస్తుంది. వచ్చే నెలలో మూవీని విడుదల చేయాలని భావిస్తున్నారు. 

Read more: ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, బన్నీ, చరణ్, పవన్... స్టార్స్ ప్రజెంట్ రెమ్యూనరేషన్స్! టాప్ లో ఉంది ఎవరు?

Also read: నారా రోహిత్ చిత్రం రిలీజ్ కు ఎన్నికల కోడ్ అడ్డం వస్తుందా?
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Jr NTR: చిరంజీవి తర్వాత ఎన్టీఆర్ ని టార్గెట్ చేశారా ?..సంచలన నిర్ణయం, తారక్ పేరుతో ఎవరైనా అలా చేస్తే చుక్కలే
Illu Illalu Pillalu Today Episode Dec 9: అమూల్యతో పెళ్లికి విశ్వక్ కన్నింగ్ ప్లాన్, వల్లిని నిలదీసిన రామరాజు