“క్రాక్” దర్శకుడికి నారా లోకేష్ స్పెషల్ విషెష్!

Surya Prakash   | Asianet News
Published : Mar 13, 2021, 05:34 PM IST
“క్రాక్” దర్శకుడికి నారా లోకేష్ స్పెషల్ విషెష్!

సారాంశం

రవితేజ,శృతీ హాసన్ జంటగా నటించిన తాజా చిత్రం ‘క్రాక్’. సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలైన ఈ చిత్రం మొదటి షోతోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. కలెక్షన్స్ వైజ్ గానూ అదిరిపోయే ఓపెనింగ్స్ ను సాధించింది. మొదటి రోజు ఆలస్యంగా విడుదలైనప్పటికీ రిజల్ట్ లో మార్పు రాకపోవటం ఆ సినిమా సత్తాను చెప్పింది. పోటీగా మరో మూడు సినిమాలున్నప్పటికీ… తరువాత కొత్త సినిమాలు కూడా రిలీజ్ అయినప్పటికీ స్ట్రాంగ్ రన్ ను కొనసాగిస్తూనే వచ్చి కొత్త రికార్డ్ లు క్రియేట్ చేసింది. 

ఫిబ్రవరి 5న ఆహా ఓటిటిలో విడుదలైనప్పటికీ.. కొన్ని మాస్ ఏరియాల్లో స్టడీ కలెక్షన్లను సాధిస్తూనే వచ్చింది ఈ చిత్రం. ఈ చిత్రాన్ని అంత అదిరిపోయే స్దాయి లో తీసిన దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా ఇండస్ట్రీ వర్గాలు ప్రత్యేకంగా అభినందనలు తెలిపాయి. ఈ రోజు  ఈ దర్శకుడి జన్మదినం కావడంతో ఇండస్ట్రీ వర్గాలు నుంచి శుభాకాంక్షలు కూడా వెల్లువెత్తుతున్నాయి.  

ఈ సందర్భంలో ప్రముఖ రాజకీయ నాయకుడు తెలుగుదేశం పార్టీ యువ నేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ కూడా స్పెషల్ విషెష్ తెలియజేయటం అంతటా ఆసక్తిగా మారింది.

 గోపీచంద్ కు బర్తడే విషెష్ చెప్పడమే కాకుండా అతను తీసిన “క్రాక్” సినిమా చూసి అమితంగా ఎంజాయ్ చేసానని కూడా లోకేష్ తెలిపాడు. అంతే కాకుండా తనకు మున్ముందు ఇలాంటి హిట్స్ చెయ్యాలని ఆకాంక్షిస్తూ తన ఈ దర్శకుడికి తెలిపాడు. మరి ఇలా సినిమా చూసి పుట్టినరోజు నాడు ఆ దర్శకునికి అభినందనలు తెలపడం విశేషమే అని చెప్పాలి.
 
PREV
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్