చావు బతుకుల్లో ఉన్నా ఆదుకోండి... ప్రముఖ విలన్ విజ్ఞప్తి!

Published : Mar 13, 2021, 03:04 PM IST
చావు బతుకుల్లో ఉన్నా ఆదుకోండి... ప్రముఖ విలన్ విజ్ఞప్తి!

సారాంశం

పొన్నాంబళం కొన్నాళ్లుగా అనారోగ్య కారణాల చేత వెండితెరకు దూరమయ్యారు.ఆయనకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని వైద్యులు సూచించారు. దాని కోసం చాలా డబ్బులు అవసరం ఉన్న నేపథ్యంలో మీడియా ముఖంగా చిత్ర పరిశ్రమల ప్రముఖులు తనను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు.

తమిళ నటుడు పొన్నాంబళం తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. 90లలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి టాప్ స్టార్స్ సినిమాలలో విలన్ పాత్రలు ఆయన చేయడం జరిగింది. స్టెంట్ మెన్ గా కెరీర్ మొదలుపెట్టిన పొన్నాంబళం నటుడుగా మారారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కలిపి వందకు పైగా చిత్రాలతో ఆయన నటించడం జరిగింది. కాగా పొన్నాంబళం కొన్నాళ్లుగా అనారోగ్య కారణాల చేత వెండితెరకు దూరమయ్యారు. 


తీవ్ర ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన చెన్నైలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. పొన్నాంబళం ఆరోగ్య పరిస్థితి తెలిసిన ప్రముఖ హీరోలు కమల్ హాసన్, రజినీ కాంత్ లతో పాటు ధనుష్, రాధికా శరత్ కుమార్ వంటి వారు గతంలో ఆర్థిక సాయం చేశారు. కాగా మరోమారు ఆయన ఆసుపత్రి పాలయ్యారు. ఆయనకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని వైద్యులు సూచించారు. 


దాని కోసం చాలా డబ్బులు అవసరం ఉన్న నేపథ్యంలో మీడియా ముఖంగా చిత్ర పరిశ్రమల ప్రముఖులు తనను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు. సౌత్ ఇండియా యాక్టర్స్ అసోసియేషన్ తో పాటు తెలుగు మా అసోసియేషన్ ఆర్ధిక సాయం చేయాలని పొన్నాంబళం విజ్ఞప్తి చేశారు. 

PREV
click me!

Recommended Stories

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి విలన్ గా రెండు నిమిషాలు మాత్రమే కనిపించిన సినిమా ఏదో తెలుసా?
OTT: ఒకే రాత్రి 3 హ‌త్య‌లు, ఊహ‌కంద‌ని ట్విస్టులు, ప్ర‌తీ సీన్ క్లైమాక్సే.. ఓటీటీలో సూప‌ర్ థ్రిల్ల‌ర్