Dasara Making Video : దుమ్మూధూళిలో షూటింగ్.. ‘దసరా’ మేకింగ్ వీడియో చూశారా.?

By Asianet News  |  First Published Apr 7, 2023, 5:55 PM IST

నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ ఫిల్మ్ ‘దసరా’. ఇండియా మొత్తంగా దుమ్ములేపున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా సత్తా చాటుతోంది.  రా అండ్ రస్టిక్ గా వచ్చిన ఈ చిత్రం మేకింగ్ వీడియోను అయితే విడుదల చేశారు. ఆకట్టుకుంటోంది. 
 


ప్రస్తుతం థియేటర్లలో దుమ్ములేపుతున్న చిత్రాల్లో నాని ‘దసరా’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. నేచురల్ స్టార్ కేరీర్ లో తొలిసారిగా ఊరమాస్ లుక్ లో నటించారు. మరోవైపు తెలంగాణ, సింగరేణి మైన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. తెలంగాణలోని వీర్లపల్లి గ్రామంలో జరిగిన కథను దర్శకుడు శ్రీకాంత్ అద్బుతంగా చిత్రీకరించారు.పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసి హ్యూజ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నారు. 

అయితే, గతంలో విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’లో సింగరేణి మైన్స్ లోకొన్ని చిత్రాలను షూట్ చేశారు.  కానీ  ‘దసరా’ దాదాపు సింగరేణి మైన్స్, పరిసర ప్రాంతాల్లోనే జరిగింది. దీంతో అక్కడి దుమ్ముధూళిలోనే రియలిస్టిక్ గా సినిమాను తెరకెక్కించారు. పల్లె వాతావరణం, పల్లెటూరి జనాల జీవన విధానాన్ని సినిమాలో చూపించారు. కాస్తా కమర్షిల్ టచ్ కూడా ఇచ్చారు.  ఏదేమైనా ‘దసరా’ షూటింగ్ కోసం నాని, కీర్తి సురేష్ తోపాటు దర్శకుడు, టీమ్ మెంచర్స్ బాగా  కష్టపడ్డారు.

Latest Videos

ఈ సందర్భంగా ‘దసరా’ మేకింగ్ కు సంబంధించిన వీడియోను మేకర్స్ విడుదల చేశారు. దుమ్ముధూళిలో నేచురల్ లోకేషన్లలోనే సినిమాను షూట్ చేసినట్టు వీడియో ద్వారా తెలిపారు.  అలాగే చిత్రంలో యాక్షన్ సీక్వెల్స్ ను చిత్రీకరించిన తీరు, సిబ్బంది శ్రమను చూపించారు. ఇక డీగ్లామర్ రోల్ లో నటించిన కీర్తి సురేష్ - నాని మేకప్, లోకేషన్లలో వారు మెదిలిన తీరు కూడా వీడియో కనిపించింది. ఇలా తొలిచిత్రంతోనే దర్శకుడు శ్రీకాంత్ ఓదెల అదరగొట్టంతో నాని ఫ్యాన్స్ విషెస్ చెబుతున్నారు.  

‘దసరా’కు ప్రేక్షకుల ఆదరణ దక్కడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కూడా దుమ్ములేపుతోంది. తొలిరోజే రూ.38 కోట్ల గ్రాస్ వసూల్ చేసి అదరగొట్టింది. ఇక కేవలం  ఆరు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. నాని  కేరీర్ లోనే హ్యయెస్ట్ అండ్ తొలిసారిగా వంద కోట్లు సాధించిన చిత్రంగా ‘దసరా’ నిలిచింది. మరోవైపు డెబ్యూ డైరెక్టర్ తో రూ.100 కోట్ల సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి సక్సెస్ అందుకున్నందుకు నానికీ ప్రశంసలు దక్కుతున్నాయి. 

చిత్రంలో నాని - కీర్తి సురేష్ (Keerthy Suresh) జంటగా నటించారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ పై నిర్మాత చెరుకూరి సుధాకర్ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్  సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. మార్చి 30న చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని తన 30వ చిత్రంపై ఫోకస్ పెట్టారు. అందుకే లుక్ మార్చి షూటింగ్ కూడా ప్రారంభించినట్టు తెలుస్తోంది. 

All the effort to bring the SPECTACULAR WORLD to the BIG SCREENS 🔥🔥

Here's the making of ❤️
- https://t.co/g7Oz92Sz6F pic.twitter.com/sWw1AHnK8Z

— SLV Cinemas (@SLVCinemasOffl)
click me!