
సీనియర్ హీరోయిన్ కుష్బూ ఆసుపత్రి పాలయ్యారు. ఆమెకు జ్వరమని సమాచారం అందుతుంది. విపరీతమైన ఫీవర్ కారణంగా ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆమెకు ట్రీట్మెంట్ జరుగుతుంది. ఈ విషయాన్ని కుష్బూ స్వయంగా వెల్లడించారు. ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫోటోలు షేర్ చేశారు. అలాగే ఓ సుదీర్ఘ సందేశం పంచుకున్నారు.
''ఫ్లూ వ్యాధి ప్రమాదకరం. ఇది నా మీద దుష్ప్రభావం చూపించింది. చలి జ్వరం, విపరీతమైన ఒళ్ళు నొప్పులతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. అడెనో వైరస్ ని తక్కువ అంచనా వేయవద్దు. ఏ మాత్రం అనారోగ్యంగా ఉన్న నిర్లక్ష్యం చేయకుండా ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకోండి' అని ఆమె కామెంట్స్ పోస్ట్ చేశారు. కుష్బూ అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసిన అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
కుష్బూ ఇటీవల కన్న తండ్రి మీద లైంగిక ఆరోపణలు చేశారు. కుష్బూ కామెంట్స్ సంచలనం రేపాయి. కుష్బూ 2000లో తమిళ నటుడు సి. సుందర్ ని వివాహమాడారు. పొలిటికల్ ఎంట్రీ కూడా ఇచ్చారు. మొదట కాంగ్రెస్ పార్టీలో చేరిన కుష్బూ అనంతరం బీజేపీలోకి వచ్చారు. ప్రస్తుతం జాతీయ మహిళా కమీషన్ సభ్యురాలిగా బాధ్యతలు నెరవేరుస్తున్నారు. గత ఏడాది ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. జబర్దస్త్ కామెడీ షో జడ్జిగా కూడా ఆమె వ్యవహరిస్తున్నారు.