నాని సిక్స్ ప్యాక్ ట్రై చేస్తున్నాడా?

By Prashanth M  |  First Published Aug 7, 2019, 11:53 AM IST

గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ టాలెంటెడ్ హీరో అభిమానులకు మంచి కిక్ ఇవ్వనున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం మోహన్  కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో నాని 'V' సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. 


న్యాచురల్ స్టార్ నాని చూస్తుండగానే టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ను సెట్ చేసుకున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ టాలెంటెడ్ హీరో అభిమానులకు మంచి కిక్ ఇవ్వనున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం మోహన్  కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో నాని 'V' సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. 

నానికి ఇది 25వ సినిమా కావడంతో సిల్వర్ జూబ్లీ మూవీ స్పెషల్ గా ఉండాలని కొత్త లుక్ ట్రై చేస్తున్నాడట. సిక్స్ ప్యాక్ తో అభిమానులకు సరికొత్త కిక్కివ్వాలని జిమ్ లో వర్కౌట్ చేస్తున్నట్లు సమాచారం. ఏం చేసిన యువకుడిగా ఉన్నప్పుడే చేయాలి. డిఫరెంట్ కథలను ఎంచుకోవాలని నాని ఇటీవల స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడు. 

Latest Videos

అందుకే 35 ఏళ్ల వయసులో నాని మొదటిసారి సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేస్తున్నాడు. ఇది ఎంత వరకు నిజం అనేది ఇంకా తెలియరాలేదు. కానీ V సినిమాలో నాని నెగిటివ్ రోల్ లో కనిపించనున్నాడని తెలుస్తోంది. అందుకే బాడీ పెంచితే బావుంటుందని చిత్ర యూనిట్ తో డిస్కస్ చేసినట్లు సమాచారం.  సినిమాలో  సుధీర్ బాబు కూడా ఒక ముఖ్య పాత్రలో నటించనున్న సంగతి తెలిసిందే.       

click me!