సీరియల్ నటుడి భార్య సూసైడ్.. భర్త వేధింపులే కారణమా?

Published : Aug 07, 2019, 11:48 AM IST
సీరియల్ నటుడి భార్య సూసైడ్.. భర్త వేధింపులే కారణమా?

సారాంశం

హైదరాబాద్ మణికొండలో మధు ప్రకాష్ భార్య భారతి (34) గత రాత్రి సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమె మరణానికి కారణం భర్త వేధింపులే కారణమని భారతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 

టాలీవుడ్ సీరియల్ యాక్టర్ భార్య ఆత్మహత్య చేసుకోవడం బుల్లి తెర వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ మణికొండలో మధు ప్రకాష్ భార్య భారతి (34) గత రాత్రి సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమె మరణానికి కారణం భర్త వేధింపులే కారణమని భారతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 

ఘటన స్థలానికి  చేరుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గత కొంత కాలంగా భార్య భర్తలిద్దరి మధ్య గొడవలు సాగుతున్నట్లు భారతి బంధువులు చెబుతున్నారు. నటుడు మధు ప్రకాష్ భారతిని పట్టించుకోకుండా మరో మహిళతో క్లోజ్ గా ఉన్నందుకే ఆమె పలుమార్లు నిలదీసినట్లు చెబుతున్నారు. 

కుటుంబ సభ్యుల కేసు నమోదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె మరణానికి గల కారణాలను వెతికే పనిలో పడ్డారు. భారతి ఆత్మహత్య పై రకరకాల అనుమానాలు రేగుతున్నప్పటికీ అవి ఎంత వరకు నిజమనేది నిర్ధారణకాలేదు. విచారణ అనంతరం పోలీసులు ఆ విషయాలపై క్లారిటీ ఇవ్వనున్నారు. 

PREV
click me!

Recommended Stories

RajaSaab కి ఒకవైపు నెగిటివ్ టాక్ వస్తుంటే హీరోయిన్ ఏం చేస్తోందో తెలుసా.. బన్నీని బుట్టలో వేసుకునే ప్రయత్నం ?
Illu Illalu Pillalu Today Episode Jan 13: డబ్బు పోగొట్టిన సాగర్, అమూల్యకు పెళ్లి ఇష్టం లేదన్న వేదవతి