శర్వానంద్ - నాని.. బాలీవుడ్ హిట్టు కథ ఎవరిని వరిస్తుందో?

Published : Oct 22, 2018, 04:55 PM IST
శర్వానంద్ - నాని.. బాలీవుడ్ హిట్టు కథ ఎవరిని వరిస్తుందో?

సారాంశం

భాషలతో సంబంధం లేకుండా రీమేక్ కథలు చాలా పుట్టుకొస్తున్నాయి. అనువాద చిత్రాలు కూడా పరభాషా సినీ ప్రేమికులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. అయితే గత ఏడాది బాలీవుడ్ లో వచ్చిన ఒక చిన్న సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి లాభాలను అందించింది.

భాషలతో సంబంధం లేకుండా రీమేక్ కథలు చాలా పుట్టుకొస్తున్నాయి. అనువాద చిత్రాలు కూడా పరభాషా సినీ ప్రేమికులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. అయితే గత ఏడాది బాలీవుడ్ లో వచ్చిన ఒక చిన్న సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి లాభాలను అందించింది. అదే 'షాదీ మెయిన్ జరూర్ ఆనా'.

రాజ్ కుమార్ రావ్ - కృతి ఖర్బందా జంటగా నటించిన ఈ రొమాంటిక్ డ్రామా నార్త్ జనాలను ఎంతగానో ఆకట్టుకుంది. పెళ్లి జరగబోయే ముందు ప్రధాన జంట ఎదుర్కొనే అనుభవాలు సినిమాలు హైలెట్ గా నిలిచాయి. అయితే కాన్సెప్ట్ ను తెలుగులో కూడా తీయాలని ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ప్రయత్నాలు చేస్తున్నారు.  రీసెంట్ గా సినిమా తెలుగు రైట్స్ ను కూడా దక్కించుకున్నారు. 

ఇక సినిమా కథను కొందరు యువ హీరోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారట. ఆ లిస్ట్ లో నాని - శర్వానంద్ కూడా పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. అనిల్ సుంకర ఈ ఇద్దరి హీరోల్లో ఎవరో ఒకరిని ఫిక్స్ చేయాలనీ అనుకుంటున్నాడట. అయితే ఇలాంటి కథను డీల్ చేయాలంటే మంచి దర్శకుడు అవసరం. దర్శకుడు సెట్టయితే నాని - శర్వానంద్ లో ఎవరో ఒకరు రీమేక్ లో నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

PREV
click me!

Recommended Stories

Aishwarya Rai: రెండు కోలుకోలేని తప్పులు చేసిన ఐశ్వర్యా రాయ్‌.. సౌత్‌లో రెండు ఇండస్ట్రీ హిట్లు మిస్‌
Karthika Deepam 2 Latest Episode: దీపను దారుణంగా అవమానించిన జ్యో- సీరియస్ అయిన శివన్నారాయణ, సుమిత్ర