రజినీకాంత్ జైలర్ 2 అప్ డేట్ లీక్.. ఆ నటి ఎంత పనిచేసింది..?

Published : Feb 24, 2024, 12:34 PM IST
రజినీకాంత్ జైలర్ 2 అప్ డేట్ లీక్.. ఆ  నటి ఎంత పనిచేసింది..?

సారాంశం

సూపర్ స్టార్ రజినీకాంత్ సాలిడ్ కమ్ బ్యక్ ఇచ్చిన సినిమా జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈసినిమాకు సీక్వెల్ తెరకెక్కించబోతున్నారు. ఇక ఈమూవీ నుంచి సాలిడ్ అప్ డేట్ ను లీక్ చేసింది నటి మైర్నా మీనన్.   


దర్బార్ మరియు అన్నత్తే లాంటి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్‌లతో సతమతమవుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్‌కి జైలర్ సాలిడ్  కమ్ బ్యాక్ ను ఇచ్చింది.  నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం లో.. అనిరుధ్ మ్యూజిక్ తో ఈసినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. సూపర్ స్టార్ కెరీర్ లోనే భారీ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర దాదాపు 700 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టింది. తమిళంతో పాటు..తెలుగు, కన్నడ, మలయాళంలో కూడా ఈమూవీ సూపర్ హిట్ అయ్యింది. 

ప్లాప్స్ లో ఉన్న లోకేష్కనగరాజు ను నమ్మి ఈ అవకాశం ఇచ్చాడు సూపర్ స్టార్.  ఈ సినిమా నుంచి నెల్సన్ ను తప్పించాలని ప్రయత్నించినా.. రజినీకాంత్  మాత్రంనెల్సన్ మరియు జైలర్ కథపై నమ్మకంతో  ధైర్యంగా నెల్సన్‌ను దర్శకత్వం వహించడానికి అనుమతించారు. నెల్సన్, తను ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడ్డాడు. అద్భుతమైన విజయాన్ని అందించి చూపించాడు. గత ఏడాది ఆగస్టులో విడుదలైన ఈ సినిమా తమిళంలోనే కాకుండా అన్నిభాషల్లో కూడా విడుదలై కలెక్షన్ల వర్షం కురిపించింది.

ఇక జైలర్ సినిమా అప్పుడే ఈసినిమాకు సీక్వెల్ చేయాలని ప్లాన్  చేశారట టీమ్. కాని అది అఫీషియల్ గా బయటకు రాలేదు. ఈ సినిమా  భారీ హిట్ అవ్వడంతో అప్పటి వరకూ సీక్వెల్ పై నొరు మెదపని  రజనీకాంత్.. వెంటనే నెల్సన్ కి ఫోన్ చేసి జైలర్ సెకండ్ పార్ట్ వర్క్ స్టార్ట్ చేయమన్నారట. ఇక సూపర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నెల్సన్ కూడా సినిమాకు సబంధించిన స్క్రీప్ట్ ను కంప్లీట్  చేసేపనిలోఉన్నాడట. అంతే కాదు ఈమూవీని కూడా  సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. దీనికి అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నాడని సమాచారం.

ఇదిలా ఉంటే, జైలర్‌లో నటుడు రజనీకాంత్ కోడలిగా నటించిన మిర్నా, ఇటీవలి ఇంటర్వ్యూలో జైలర్ 2కి సంబంధించిన అప్‌డేట్‌ను లీక్ చేసింది. ఆమె చెప్పిన సమాచారం ప్రకారం.. డైరెక్టర్ నెల్సన్ దిలీజ్  జైలర్ 2 స్క్రిప్ట్ పనిలో ఉన్నాడట. తనతో ఈ విషయం స్వయంగా నెల్సన్ చెప్పినట్టు తెలుస్తోంది. అయితే అందులో తాను ఉన్నానో లేదో తెలియదు అంటోందిమీర్నా. నా పాత్రపు పెంచాలి అనుకుంటే అందులోనేను ఉంటాను. లేకపోతే లేదు అన్నారు నటి. అదంతా దర్శకుడిపై ఆదారపడి ఉందన్నారు. 

PREV
click me!

Recommended Stories

రూ. 50 లక్షలతో తీస్తే రూ. 100 కోట్లు వచ్చింది.. దుమ్మురేపిన ఈ చిన్న సినిమా ఏంటో తెలుసా.?
Sitara-Balakrishna: సితార ఘట్టమనేని మిస్‌ చేసుకున్న బాలకృష్ణ సినిమా ఏంటో తెలుసా? మంచే జరిగింది