MEGASTAR : మెగాస్టార్ కొత్త సినిమా ఫిక్స్... కుర్ర హీరోలకు షాకిస్తున్న చిరు.

By Mahesh JujjuriFirst Published Dec 14, 2021, 5:50 PM IST
Highlights

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా అనౌన్స్ చేశారు. కేవలం రెండు సినిమాలతో తన టాలెంట్ చూపించిన వెంకీ కుడుములతో.. మూవీ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ మెగా ప్రాజక్ట్ ను డివివి దానయ్య నిర్మించబోతున్నారు. 
 

మెగాస్టార్ చిరంజీవి కుర్ర హీరోలకు షాక్ ఇస్తున్నారు. యంగ్ హీరోలకంటే స్పీడ్ గా దూసుకెళ్తున్నారు.  ఇప్పటికే నాలుగు సినిమాలు లైన్ లో పెట్టిన మెగాస్టార్ ఇప్పుడు ఐదో సినిమాను సెట్స్ ఎక్కించబోతున్నారు. ఛలో,భీష్మ సినిమాలతో సూపర్ సక్సెస్ ఫామ్ లో ఉన్న,వెంకీ కుడుముల డైరెక్షన్ లో చిరు 156వ మూవీ చేయబోతున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. మెగాస్టార్ తో పాటు వెంకీ కుడుముల, డివివి దానయ్య కలిసిన ఫోటోను ను శేర్ చేశారు. 

భీష్మ సినిమా తరువాత మెగామూవీ కోసం గట్టిగానే వర్కైట్ చేశాడు వెంకీ కుడుములు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కూడా సినిమా కోసం ట్రై చేశాడు. ఎట్టకేళకు చిరంజీవికి కథ  చెప్పే ఛాన్స్ రావడంతో.. మెగాస్టార్ ను తన స్టోరీ లైన్ తో ఇంప్రెస్ చేశాడు. చిరంజీవికి స్టోరీ లైన్ నచ్చడం... మెగాస్టార్ చెప్పినట్టు లైన్ ను డెవలప్ చేసుకుని.. మెగా మూవీని కన్ ఫార్మ్ చేసుకున్నాడు వెంకీ కుడుముల. ఇలాంటి అవకాశం లైఫ్ లో ఒక్కసారే వస్తుంది. ఆ అవకాశం తనకు వచ్చినందకు పట్టలేని సంతోషంలో ఉన్నట్టు వెంకీ కుడుముల ట్వీట్ చేశారు. మెగాస్టార్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. 

Opportunities like this come once in a lifetime!
Thank you Sir for giving me mine. Your trust in me and my admiration for you will drive me to work to the best of my ability🙏
Thank you and Dr. Madhavi Raju Garu for bankrolling this ! https://t.co/oTRSBGxgdg

— Venky Kudumula (@VenkyKudumula)


ఈ సినిమాను డివివి మూవీస్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం దానయ్య ట్రిపుల్ ఆర్ సినిమాను కూడా నిర్మిస్తున్నారు. గతంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో.. బోయాపాటి డైరెక్షన్ లో వినయ విధేయ రామ సినిమాను నిర్మించారు దానయ్య. మెగా ఫ్యామిలతో దానయ్య రెండోవ సినిమా చేయబోతున్నారు. త్వరలోనే ఈమూవీ సెట్స్ మీదకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది.

Also Read : Bheemla Nayak: పవన్‌ కళ్యాణ్‌కి రానా స్ట్రాంగ్ వార్నింగ్‌ .. బర్త్ డే గిఫ్ట్

click me!