జెర్సీ దెబ్బ ఎవరిపైన?

By Prashanth MFirst Published Apr 20, 2019, 9:46 AM IST
Highlights

మార్కెట్లో హిట్ సినిమా అంటే జనం ఆ సినిమానే చూడటానికి ఉత్సాహం చూపిస్తారు. అప్పటిదాకా ధియోటర్లలో కొలువై ఆడుతున్న సినిమాలకు బై చెప్తారు. అందుకే ఆల్రెడీ ధియోటర్ లో ఉన్న సినిమాలన్నీ ప్రతీ శుక్రవారం తమ పరిస్దితి ఏమిటా అని ఆసక్తిగా రిలీజైన కొత్త సినిమాల రిజల్ట్ ల వైపు చూస్తాయి. 

మార్కెట్లో హిట్ సినిమా అంటే జనం ఆ సినిమానే చూడటానికి ఉత్సాహం చూపిస్తారు. అప్పటిదాకా ధియోటర్లలో కొలువై ఆడుతున్న సినిమాలకు బై చెప్తారు. అందుకే ఆల్రెడీ ధియోటర్ లో ఉన్న సినిమాలన్నీ ప్రతీ శుక్రవారం తమ పరిస్దితి ఏమిటా అని ఆసక్తిగా రిలీజైన కొత్త సినిమాల రిజల్ట్ ల వైపు చూస్తాయి. 

ఇప్పుడు నాని హీరోగా క్రికెట్ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన జెర్సీ హిట్ అవటంతో  ఆల్రెడీ ధియోటర్ లో ఉన్న  మజలీ,  'చిత్రలహరి'  లపై ఏ మేరకు ఇంపాక్ట్ పడుతుంది, ఏ సినిమాకు కలెక్షన్స్ వైజ్ దెబ్బ పడుతుందనేది ఆసక్తికరమైన చర్చగా ట్రేడ్ లో మారింది. 

ట్రేడ్ లో వేస్తున్న అంచనాలు ప్రకారం జెర్సీ సినిమా ప్రభావం ...డైరక్ట్ గా మజలీ సినిమాపై పడనుంది. రెండూ క్రికెట్ నేపధ్యాలు కావటం, ఫ్యామిలీ ఎమోషన్స్ పై దృష్టి పెట్టి కథ నడపటం, అలాగే ఎనభై, తొంభైల్లో ప్లాష్ బ్యాక్ లతో ఉండటం,సెంటిమెంట్ ఈ రెండు సినిమాలకు ఒకే విధంగా ప్రేక్షకుడు చూసేలా చేస్తుంది. అంతేకాదు...మజిలీ ఆల్రెడీ రెండు వారాలు దాటటంతో జనం దృష్టి కొత్త సినిమా జెర్శీపై పడుతుంది. ఆ ప్రేక్షకులు ఇటు షిప్ట్ అవుతారు. అయితే చిత్రలహరికి ఇది జెర్శీ ఇంఫాక్ట్ పెద్దగా ఉండదు. 

ఆరు వరస  ఫ్లాపుల తర్వాత, తన మార్కెట్‌  కాస్తంత సాయి తేజకు ఊరట నిస్తూ  వచ్చిన చిత్రం 'చిత్రలహరి' . ఈ చిత్రానికి యావరేజ్ గా  వుందని  డివైడ్ టాక్  వచ్చినా కానీ దేవిశ్రీప్రసాద్‌ పాటలతో పాటు మంచి డైలాగులు ప్లస్‌ అయి బాక్సాఫీస్‌ వద్ద సేఫ్‌ సినిమాగా నిలిచింది.  దాంతో జెర్శీ టాక్ ని తట్టుకోవాలంటే ప్రమోషన్స్ డోస్ పెంచాల్సిన సిట్యువేషన్. 

 మజిలీ చిత్రంతో నాగచైతన్యకి కూడా సోలోగా  పెద్ద హిట్టే  దక్కింది. వరుసగా రెండునెలల పాటు చూడతగ్గ సినిమాలు లేని లోటుతో సమ్మర్‌లో ముందుగా వచ్చిన ఈ చిత్రాలకి ప్రేక్షకాదరణ బాగుంది. వేసవి సెలవులని క్యాష్‌ చేసుకునేందుకు ధియోటర్స్ కు ఇది మంచి టైమ్. ఫ్లాఫ్ ల్లో హీరోలకు కోలుకోవడానికి ఇదో సదవకాశం.  

click me!