దిల్ రాజు మార్కెటింగ్ స్ట్రాటజీ.. అది అసలు మల్టీస్టారరే కాదట!

Published : Apr 12, 2019, 10:48 AM IST
దిల్ రాజు మార్కెటింగ్ స్ట్రాటజీ.. అది అసలు మల్టీస్టారరే కాదట!

సారాంశం

దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ.. దిల్ రాజు బ్యానర్ లో ఓ సినిమా చేయాల్సివుంది. 

దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ.. దిల్ రాజు బ్యానర్ లో ఓ సినిమా చేయాల్సివుంది. ఇప్పటికే దానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయింది. నాని, సుధీర్ బాబు హీరోలుగా ఈ సినిమా ఉంటుందని, 'వ్యూహం' అనే టైటిల్ కూడా పెట్టారని వార్తలు వచ్చాయి.

అయితే ఈ సినిమా అసలు మల్టీస్టారర్ ప్రాజెక్ట్ కాదని సమాచారం. సినిమాలో మెయిన్ హీరోగా సుధీర్ బాబే కనిపిస్తారట. సినిమాలో నాని మాత్రం గెస్ట్ రోల్ లా ఉంటుందని చెబుతున్నారు. నాని పోర్షన్ కేవలం 15 నుండి 20 నిమిషాలు మాత్రమే ఉంటుందని సమాచారం.

కానీ సినిమా మార్కెట్ చేసుకోవడం కోసం దిల్ రాజు దీన్ని మల్టీస్టారర్ చిత్రంగా ప్రొజెక్ట్ చేస్తున్నాడు. గతంలో చరణ్, బన్నీలు నటించిన 'ఎవడు' సినిమా ఇదే కోవలోకి వస్తుంది. సినిమాలో బన్నీ రోల్ ఎక్కువసేపు ఉండనప్పటికీ అప్పట్లో ఆ సినిమాను మల్టీస్టారర్ గానే మార్కెట్ చేశారు.

ఇప్పుడు దిల్ రాజు అదే స్ట్రాటజీ ఈ సినిమాకు కూడా వాడుతున్నాడు. ఈ సినిమాకి దిల్ రాజుతో పాటు నాని కూడా ఓ నిర్మాతగా వ్యవహరిస్తాడని అంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి!

PREV
click me!

Recommended Stories

ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు.. 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న స్టార్ హీరోల సినిమాలు
Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?