'జెర్సీ' ట్రైలర్.. నాని మరో హిట్టు కొట్టేలా ఉన్నాడే!

Published : Apr 12, 2019, 09:53 AM IST
'జెర్సీ' ట్రైలర్.. నాని మరో హిట్టు కొట్టేలా ఉన్నాడే!

సారాంశం

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న చిత్రం 'జెర్సీ'. గౌతం తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ట్రైలర్ శుక్రవారం నాడు విడుదల చేశారు.

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న చిత్రం 'జెర్సీ'. గౌతం తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ట్రైలర్ శుక్రవారం నాడు విడుదల చేశారు. ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్ గా శ్రద్ధాశ్రీనాథ్ నటిస్తోంది.

ఇందులో నాని క్రికెటర్ అర్జున్ పాత్రలో కనిపించనున్నాడు. క్రికెటర్ గా నాని ఎంట్రీ ఇవ్వడం, తోటి క్రికెటర్ లతో గొడవ, హీరోయిన్ తో ప్రేమ అనే అంశాలతో ట్రైలర్ మొదలైంది. అయితే క్రికెట్ కి దూరమైన పదేళ్ల తరువాత ఎలాంటి ఉద్యోగం లేకుండా తనలో తనే మదన పడే సన్నివేశాలను ట్రైలర్ లో ఎమోషనల్ గా చూపించారు.

ట్రైలర్ లో నాని పలికిన ప్రతీ డైలాగ్ భావోద్వేగంగా ఉన్నాయి. ''ఇంత పెద్ద ప్రపంచంలో ఈరోజు దాకా నన్ను జడ్జ్ చేయనిది.. నా కొడుకు ఒక్కడే.. వాడి దృష్టిలో నేను కొంచెం తగ్గినా తట్టుకోలేను'' అంటూ ట్రైలర్ ఆఖరిలో చెప్పిన డైలాగ్ హైలైట్ గా నిలిచింది.

నేపధ్య సంగీతం మరో హైలైట్ గా నిలిచింది.సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

PREV
click me!

Recommended Stories

ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు.. 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న స్టార్ హీరోల సినిమాలు
Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?