ఏడాది పాటు అన్నం తిన్లేదు.. డ్రైవర్ గానూ వాడేసుకున్నారు.. కేరీర్ ప్రారంభంలో నాని కష్టాలు..

By Asianet News  |  First Published Mar 26, 2023, 4:12 PM IST

 నేచురల్ స్టార్ నాని (Nani) తన కేరీర్ తొలినాళ్లలో ఎలాంటి కష్టాలను అనుభవించారో వెల్లడించారు. తాజాగా రవితేజతో కలిసి ముచ్చటించిన నాని షాకింగ్ విషయాలను బయటపెట్టారు.


ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న హీరోల్లో నేచురల్ స్టార్ నాని ఒకరు. రంగుల ప్రపంచంలో అడుగుపెట్టాలని, వెలుగొందాలని చాలా మంది ఆశిస్తుంటారు. కానీ ఆ అదృష్టం నూటికొక్కరికి దక్కుతుంటుంది. అందుకు ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. పగలు, రాత్రి తేడా లేకుండా, తిండి, నిద్రలు మానుకొని, అవమానాలనూ దాటుకొని అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు. బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారికి పెద్దగా ఇలాంటి కష్టాలు ఉండకపోవచ్చు. కానీ ఎవరి సపోర్ట్ లేకపోతే మాత్రం వీటన్నింటిని దాటుకొని వెళ్లాల్సిందే. 

నేచురల్ స్టార్ నాని సైతం తన కేరీర్ ప్రారంభంలో అవకాశాల కోసం చాలా ఇబ్బందులు పడ్డట్టు తెలిపారు. ప్రస్తుతం నాని ‘దసరా’ Dasara మూవీ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో మాస్ మహారాజ రవితేజ (RaviTeja)తో కలిసి స్పెషల్ గా చిట్ చాట్ చేశారు. ‘ధరణి విత్ రావణసుర’ టైటిల్ తో ఇంటర్వ్యూను తాజాగా విడుదల చేశారు. ఈ ఇంటర్వ్యూలో నాని తన కేరీర్ ప్రారంభానికి ముందుకు ఎన్ని కష్టాలు పడ్డారో చెప్పుకొచ్చారు. 

Latest Videos

నాని మాట్లాడుతూ.. ‘ఫస్ట్ నేను నటుడిగానే ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నించాను. చాలా ఆఫీసులకు వెళ్లినా ఫలితం లేదు. చిన్న పాత్రకు కూడా ఎవరూ ఫోన్ చేయలేదు. అదే సమయంలో కొందరి నమ్మాల్సి వచ్చింది. అవకాశాలు రాకపోగా.. నన్ను డ్రైవర్ గానూ కొన్నాళ్లు వాడేసుకున్నారు. అలా సమయం, డబ్బులు కూడా వృథా అయ్యాయి. ఇక అప్పటికి రియలైజ్ అయ్యి యాక్టింగ్ వద్దునుకొని డైరెక్షన్ డిపార్టుమెంట్ లో అవకాశాల కోసం ప్రయత్నించాను. 

ఎక్కడ తిరిగిన పనవ్వట్లేదని తెలిసి.. దిగ్గజ దర్శకుడు బాపు (సత్తిరాజు లక్ష్మినారాయణ) గారి వద్ద అవకాశం కోసం ఏడాదిగా ప్రయత్నించాను. ఆయనకు ఎప్పుడూ కనిపించేందుకు మధ్యాహ్నం సమయంలో వారి ఆఫీస్ కు వెళ్లే వాడిని.. అలా ఏడాది తర్వాత క్లాప్ డైరెక్టర్ గా తీసుకున్నారు. ఆ సమయంలో ఏడాదిగా మధ్యాహ్నం భోజనం అన్నం తినలేదు. దాంతో  కాస్తా  బక్క చిక్కిపోయాను. ఇక తర్వాత మళ్లీ ‘అష్టా చమ్మా’తో అవకాశం అందించి దేవుడు ఇటు పంపించాడు.’ అంటూ చెప్పుకొచ్చారు. 

నాని కేరీర్ లోనే  ‘దసరా’ తొలి పాన్ ఇండియా చిత్రంగా విడుదల కాబోతోంది. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానరపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. కీర్తి సురేష్ నాని సరసన నటించిన విషయం తెలిసిందే. మార్చి 30న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో చిత్రాన్ని మరింత జోష్ గా ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ మెటీరియల్ కూడా సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. మరోవైపు నాని30ని కూడా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అలాగే రవితేజ ‘రావణసుర’ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 7న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా ఇద్దరు కలిసి ఇంట్రెస్టింగ్ గా ఇంటర్వ్యూ చేయడం ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది.

click me!