అజిత్ ఇంటికి విజయ్.. కశ్మీర్ నుంచి రాగానే వెళ్లిన దళపతి

Published : Mar 26, 2023, 03:27 PM IST
అజిత్ ఇంటికి విజయ్.. కశ్మీర్ నుంచి రాగానే వెళ్లిన దళపతి

సారాంశం

టాలీవుడ్ లో ఎలా ఫ్యాన్ వార్స్ జరుగుతుంటాయో.. కోలీవుడ్ లో అంతకి మించిన రచ్చే ఉంటుంది. నిత్యం అజిత్, విజయ్ ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా గొడవలు జరుగుతుంటాయి.

టాలీవుడ్ లో ఎలా ఫ్యాన్ వార్స్ జరుగుతుంటాయో.. కోలీవుడ్ లో అంతకి మించిన రచ్చే ఉంటుంది. నిత్యం అజిత్, విజయ్ ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా గొడవలు జరుగుతుంటాయి. సోషల్ మీడియాలో ఒకరి హీరోని మరొకరి కించపరుచుకుంటూ ట్రెండ్ లు చేయడం గతంలో చూశాం. అలాంటి ఇద్దరు హీరోలు కలుసుకుంటే అభిమానులకు ఆసక్తిగానే ఉంటుంది. 

తాజాగా అజిత్ కుమార్ ఇంటికి ఇలయదళపతి విజయ్ వెళ్లారు. ఇటీవల అజిత్ కుమార్ తండ్రి సుబ్రహ్మణ్యం మరణించిన సంగతి తెలిసిందే. దీనితో తమిళ సినీ ప్రముఖులు, సెలెబ్రిటీలు అజిత్ కుటుంబానికి సానుభూతి తెలిపారు. సుబ్రహ్మణ్యం మృతికి నివాళులు అర్పించారు. ఆ సమయంలో విజయ్ కశ్మీర్ లో తన తదుపరి చిత్రం 'లియో' షూటింగ్ లో బిజీగా ఉండడం వల్ల రాలేకపోయారు. 

కానీ విజయ్ రీసెంట్ గా చెన్నై చేరుకున్నారు. నగరానికి రాగానే విజయ్ అజిత్ ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన వాహనాలకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.   

సందర్భం ఏదైనా అజిత్, విజయ్ చాలా కాలం తర్వాత కలవడంతో అభిమానులు సంతోషిస్తున్నారు. 1995లో అజిత్, విజయ్ కలసి రాజావిన్ పార్వైలే చిత్రంలో నటించారు. ఆ తర్వాత వీరిద్దరూ తమిళనాట స్టార్ హీరోలుగా ఎదిగారు. వీరిద్దరి సినిమాలు రిలీజ్ అవుతుంటే తమిళనాట పండగ వాతావరణం ఉంటుంది. 

PREV
click me!

Recommended Stories

100 సినిమాల్లో 44 ప్లాప్ లు, 30 మూవీస్ రిలీజ్ అవ్వలేదు, అయినా సరే ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
భగవంతుడా ఒక్క ఫ్లాప్ ఇవ్వు అని వేడుకున్న చిరంజీవి డైరెక్టర్ ఎవరో తెలుసా? వరుసగా 16 సక్సెస్ లు తట్టుకోలేకపోయాడా?