రాజమౌళిని మించిన తోపు లేరు.. ఈగతోనే నన్ను అక్కడి వరకు తీసుకెళ్లారు, ఆసక్తికరంగా నాని కామెంట్స్

Published : Mar 29, 2023, 04:02 PM IST
రాజమౌళిని మించిన తోపు లేరు.. ఈగతోనే నన్ను అక్కడి వరకు తీసుకెళ్లారు, ఆసక్తికరంగా నాని కామెంట్స్

సారాంశం

మరికొన్ని గంటల్లో నేచురల్ స్టార్ నాని నటించిన దసరా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. నాని ఎంతో ప్రతిష్టాత్మకంగా, తన ఇమేజ్ కి భిన్నంగా నటించిన చిత్రం ఇది. 

మరికొన్ని గంటల్లో నేచురల్ స్టార్ నాని నటించిన దసరా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. నాని ఎంతో ప్రతిష్టాత్మకంగా, తన ఇమేజ్ కి భిన్నంగా నటించిన చిత్రం ఇది. నాని ఈ తరహా రగ్గడ్ లుక్ గతంలో ఎప్పుడూ కనిపించలేదు. బాడీ లాంగ్వేజ్ కూడా ఊరమాస్ అన్నట్లుగా ఉంది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించారు. దసరా చిత్రంపై ఆడియన్స్ లో మంచి బజ్ ఉంది. 

ఇక ఈ చిత్రం సిల్వర్ స్క్రీన్స్ పై ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో వేచి చూడాలి. రేపు మార్చి 30న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా రిలీజ్ కి రెడీ అవుతోంది. నాని అండ్ టీం ప్రచార కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు. నాని జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించింది. చరిత్ర సృష్టిస్తూ ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. దీనితో ఎక్కడికెళ్లినా రాజమౌళి ప్రస్తావన ఉంటోంది. ఇటీవల ఇంటర్వ్యూలో నానికి కూడా ఆర్ఆర్ఆర్, రాజమౌళి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. నాని స్పందిస్తూ రాజమౌళి స్టామినా ఏంటో తన మాటల్లో చెప్పారు. 

బిగ్ స్క్రీన్ పై వినోదం అందించడంలో రాజమౌళి గారి విజన్ వేరే లెవల్ లో ఉంటుంది. బిగ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ కి రాజమౌళికి మించిన బ్రాండ్ అంబాసిడర్ ఇంకొకరు లేరు. బిగ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ ని బలంగా నమ్మే వ్యక్తి రాజమౌళి గారు. ఆయనకి అందరూ థ్యాంక్స్ చెప్పాలి. 

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడంలో రాజమౌళి గారు ఆయనికి ఆయనే సాటి. భాషా భేదాలు చెరిపేయడంలో, దేశాలు దాటి సినిమాని తీసుకెళ్లడంలో రాజమౌళి గారి పనితీరు అద్భుతం. ఆయన చిత్రాలకు మల్టిఫ్లెక్స్ ఆడియన్స్, సింగిల్ స్క్రీన్ ఆడియన్స్.. మాస్, క్లాస్ అనే తేడా ఉండదు. రాజమౌళి సినిమా విడుదలైతే అందరూ థియేటర్స్ కి ఎగబడతారు. 

ఈ సందర్భంగా నాని తాను రాజమౌళి దర్శకత్వంలో నటించిన ఈగ చిత్రాన్ని గుర్తు చేసుకున్నారు. నేను అప్పటికి ఐదారు చిత్రాల్లో నటించాను. నాలో పొటెన్షియల్ చూసి ఈగ చిత్రానికి ఎంపిక చేశారు. ఈ చిత్రంలో నాది 40 నిమిషాల పాత్రే ఉంటుంది. ఆ తర్వాత నా ఆత్మ ఈగగా మారుతుంది. ఆయా చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలిసిందే. 

ఆ చిత్రం ఇతర భాషల్లోకి డబ్ కూడా అయి అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుంది. తెలుగు రాష్ట్రాలని దాటి నాకు గుర్తింపు ఏర్పడిందంటే మొదటి కారణం ఈగ చిత్రమే. ఆ చిత్రంలో నటించడం వల్లే ఇతర రాష్ట్రాల అభిమానులు నా గురించి తెలుసుకోవడం ప్రారంభించారు. నాకు మొట్టమొదటి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చిన చిత్రం అంటే ఈగ అనే చెబుతాను అని నాని అన్నారు. ఇప్పుడు దసరా చిత్రం కూడా పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

అఖండ-2లో బాలయ్య కూతురిగా ఫస్ట్ ఛాయస్ స్టార్ హీరో కూతురట.. ఆమె ఎవరో తెలుసా.?
Jinn Movie Review: జిన్‌ మూవీ రివ్యూ.. హర్రర్‌ సినిమాల్లో ఇది వేరే లెవల్‌