
రిలీజ్ కు రెడీగా ఉంది శాకుంతలం మూవీ. వచ్చేనెల థియేటర్లలో సందడి చేయబోతున్న ఈసినిమా ప్రమోషన్ల బిజీలో ఉన్నారు గుణశేఖర్ అండ్ టీమ్. ఇప్పటికే.. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ.. గుళ్లు.. గోపురాలుతిరుగుతూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. సమంతతో పాటు హీరో పాత్రలో నటించిన మలయాళ యాక్టర్ దేవ్ మోహన్ కూడా ..టీమ్ తో పాటు ప్రమోషన్లలో పాల్గోంటున్నారు. ఈక్రమంలో.. శాకుంతలం సినిమా గురించి ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు గుణశేఖర్ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు పంచుకున్నారు.
గుణశేఖర్ ఏ కథ తీసుకున్నా దానిపై కసరత్తు చేస్తారు.. ఏదో హడావిడిగా చూట్టేసి... సినిమా చేసేద్దాం అని అనుకోరు. శాకుంతలం సినిమా కోసం నాలుగేళ్లకు పైగా కష్టపడ్డాడు గుణశేఖర్. ఆ కథపై .. ప్రధానమైన పాత్రలపై ఒక రేంజ్ లో హోమ్ వర్క్ చేస్తారు దర్శకుడు. ఇక శాకుంతలం గురించి ఆయన పడ్డ తపన అంతా ఇంతా కాదు. అందులోను నిర్మాతల గురించి ఎదురు చూడకుండా తానే సినిమాకు అన్నీఅయ్యారు. గుణశేఖర్ సొంత బ్యానర్లో నిర్మితమైన శాకుంతలం సినిమాను ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో గుణశేఖర్ మాట్లాడుతూ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఒక ఏడాది పాటు జరిగాయన్నారు.. షూటింగుకి ఒక 6 నెలల సమయాన్ని అనుకుని 81 వర్కింగ్ డేస్ లో పూర్తిచేశామన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులకే ఎక్కువ టైమ్ పట్టిందంటున్నారు దర్శకుడు. ఏడాదిన్నర పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేశాము. అలా ఈ సినిమాను రెడీ చేయడానికి దాదాపుగా మూడేళ్లు పట్టింది అన్నారు గుణశేఖర్. ఇక ఈ సందర్భంగా సినిమాకు సబంధించి మరికొన్ని విషయాలుపంచుకున్నారు స్టార్ సీనియర్ డైరెక్టర్.
అయితే ఈసినిమాకు శకుంతల పాత్రలో సమంతను అనుకోలేదు అన్నారు గుణశేఖర్. కాళిదాసు శకుంతలను ఎలా వర్ణించారనేది నేను చదివాను. అందువలన ఆ పాత్రకి ఎవరైతే బాగుంటారా అని ఆలోచన చేస్తుండగా.. సమంత అయితే బాగుంటుంది అని మా అమ్మాయి చెప్పింది అన్నారు గుణశేఖర్. అసలు సమంతను అతను అనుకోలేదట. సమంత అయితే ఎలా ఉంటుంది అని.. చాాాలామంది సలహాఇవ్వడంతో .. ఆమె నటించిన రంగస్థం సినిమా రెండో సారి చూశాను అన్నారు గుణశేఖర్. అప్పుడే నాకు అర్ధం అయ్యింది.. ఒక పాత్రలో సమంత ఎంతగా ఒదిగిపోతుందనేది నాకు అర్థమైంది. దాంతో శాకుంతలం కోసం ఆమెను సంప్రదించడం జరిగింది అని చెప్పుకొచ్చారు గుణశేఖర్.