Ante Sundaraniki Movie Update : నాని బర్త్ డే స్పెషల్.. రేపు ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్..

Published : Feb 22, 2022, 05:49 PM ISTUpdated : Feb 22, 2022, 05:51 PM IST
Ante Sundaraniki Movie Update : నాని బర్త్ డే స్పెషల్..  రేపు ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్..

సారాంశం

నేచురల్ స్టార్ నాని (Nani) ఇటీవల ‘శ్యామ్ సింగరాయ్’ మూవీతో మంచి హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక తన అప్ కమింగ్ ఫిల్మ్ ‘అంటే సుందరానికీ’ మూవీపై ఫోకస్ పెట్టాడు. అయితే ఎల్లుండి నాని పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఫ్యాన్స్ కు బిగ్గేస్ట్ ట్రీట్ అందనుంది.     

శ్యామ్ సింగరాయ్ (Shyam Singha Roy) మూవీ ఇచ్చిన జోష్ లో దూసుకుపోతున్నాడు నేచురల్ స్టార్ నాని. తన నెక్ట్స్ సినిమాలపై గట్టిగా ఫోకస్ పెట్టాడు. తన నెక్ట్స్ సినిమాలు కూడా ఆడియన్స్ కు కనెక్ట్ చేసే పనిలో పడ్డాడు నానీ. అందుకే..తన తరువాతి సినిమా ‘అంటే.. సుందరానికీ’(Ante Sundaraniki) మూవీపై మరింత శ్రద్ధ పెట్టాడు. ఇప్పటికే ఈ మూవీ చిత్రీకరణ పనులు పూర్తైనట్టు తెలుస్తోంది. న్యూ ఇయర్ గిఫ్ట్ గా ఈ మూవీ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి ఫ్యాన్స్ ను ఖుషీ చేశారు. అయితే తాజాగా మేకర్స్ అదిరిపోయే న్యూస్ తో వచ్చారు. ఫిబ్రవరి 24న నాని బర్త్ డే సందర్భంగా అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నారు. 
 
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేస్తున్నాడు. నజ్రియా నజిమ్ ( Nazriya Nazim)  నానీ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో  సుందర్ ప్రసాద్ గా నానీ నటిస్తున్నారు. ఈ సుందర ప్రసాద్ లుక్ నే ఫస్ట్ లుక్ లో పరిచయం చేశారు. అయితే నాని పుట్టిన రోజు సందర్భంగా రేపటి నునంచే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ను వరుసగా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. ఇందు కోసం రేపు 4:05 నుంచి ‘హోం అలెర్ట్’ అంటూ..  ఈ సుందరుడి పుట్టిన రోజు సందర్భంగా ‘బర్త్ డే హోమం’ అంటూ  అప్డేట్ ను అందించారు. ‘మీ భావాలను చక్కిలిగింతలు పెట్టేందుకు వస్తున్న యువ సుందర్ చమత్కారమైన ఛాయను  చూసుకోండి’ అని వెల్లడించారు. అయితే రేపు ఈ మూవీ నంచి టీజర్ గానీ, గ్లిమ్స్ గానీ విడుదలవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.  

 

శ్యామ్ సింగరాయ్ తో వేరియేషన్ చూపించిన నాని.. ప్రస్తుతం అంటే సుందరానికీ మూవీలోనూ  డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు.  ఇప్పటి వరకు  పంచెకట్టుతో.. సరికొత్త అవతారంలో కనిపిస్తున్న నాని.. సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు.  మరోవైపు ఇటీవలే నాని, కీర్తి సురేష్‌ ( Keerthy Suresh) ల కలయికలో వస్తున్న రెండో చిత్రం ‘దసరా’(Dasara Movie) ఫూజాకార్యక్రమం కూడా పూర్తయ్యింది. రెగ్యూలర్ షెడ్యూల్ కూడా మొదలు పెట్టారు దసరా టీం.   

PREV
Read more Articles on
click me!

Recommended Stories

భగవంతుడా ఒక్క ఫ్లాప్ ఇవ్వు అని వేడుకున్న చిరంజీవి డైరెక్టర్ ఎవరో తెలుసా? వరుసగా 16 సక్సెస్ లు తట్టుకోలేకపోయాడా?
Gunde Ninda Gudi Gantalu Today ఎపిసోడ్ డిసెంబర్ 16 బాలుని సవతి తల్లిలా చూశాను... ప్రభావతిలో మొదలైన పశ్ఛాత్తాపం