
భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుకకు త్రివిక్రమ్(Trivikram) నన్ను రాకుండా చేస్తున్నాడు. నేను వస్తే త్రివిక్రమ్ డామినేట్ అయిపోతాడని ఆయనకు భయం. త్రివిక్రమ్ వైసీపీ వాళ్ళతో కలిసి ఏదో ప్లాన్ చేశాడట. అందుకే భీమ్లా నాయక్ వేడుకకు నేను రావడం త్రివిక్రమ్ కి ఇష్టం లేదని బండ్ల గణేష్ ఓ వ్యక్తితో ఫోన్ లో మాట్లాడాడు. ఈ క్రమంలో త్రివిక్రమ్ ని ఆడు.. వీడు అంటూ కొంచెం వివాదాస్పద పదాలు వాడారు. ఆ వాయిస్ బండ్ల గణేష్ వాయిస్ కి చాలా దగ్గరగా ఉంది. దీంతో ఇది నిజంగా బండ్ల గణేష్ సంభాషణే అని నెటిజెన్స్ ఫిక్స్ అయ్యారు.
కాగా లీకైన ఈ ఆడియో టేప్ వివాదంపై నటుడు, నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh)స్వయంగా స్పందించారు. వైరల్ అవుతున్న ఆ ఆడియో టేపులో ఉన్న వాయిస్ తనది కాదన్నారు. ఎవరో ఇరికించడానికి కుట్రపూరితంగా క్రియేట్ చేశారని వెల్లడించారు. అయితే ఇదే స్టేట్మెంట్ అధికారికంగా ఇవ్వడానికి బండ్ల గణేష్ నిరాకరించారు. దీంతో ఆ కాల్ మాట్లాడింది బండ్ల గణేశేనా లేక వేరెవరైనా? అనే విషయంలో క్లారిటీ రాలేదు.
అసలు సదరు ఆడియో టేపులో ఏముందో గమనిస్తే... బండ్ల గణేష్ కి పవన్ (Pawan Kalyan)అభిమాని నుండి ఫోన్ వచ్చింది. సదరు అభిమాని బండ్ల గణేష్ ని, అన్న మీరు భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్తున్నారా? వేదికపై మాట్లాడడానికి స్పీచ్ రాసుకున్నారా? అని అడిగారు. పవన్ ఫ్యాన్ ప్రశ్నలకు సమాధానంగా బండ్ల.. నేను అద్భుతంగా స్పీచ్ రాసుకున్నాను. అయితే నాకు భీమ్లా నాయక్ ఈవెంట్ కి ఆహ్వానం అందలేదు. ఆ త్రివిక్రమ్ గాడు డామినేట్ అయిపోతాడని నన్ను వద్దన్నాడట. అలాగే వైసీపీ వాళ్ళతో కలిసి ఏదో ప్లాన్ చేశాడట. అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
ఎవరూ పిలవకపోయినా పర్వాలేదు మీరు వచ్చేయండి అన్నా... అని ఫ్యాన్ అన్నారు. దానికి పిలవకుండా రావడం బాగోదు. అయితే మీరు స్టేడియం లో బండ్లన్న... బండ్లన్న... అంటూ గట్టిగా అరవండి. అప్పుడు నేను లోపలి వచ్చేస్తాను.. అన్నారు. దానికి మేము లోపల రచ్చ చేస్తామన్నా, మీరు వచ్చేయాలి, అంటూ బండ్ల గణేష్ కి పవన్ ఫ్యాన్ హామీ ఇచ్చాడు. ఇలా ఇద్దరి మధ్య సంభాషణ సాగింది.
పవన్ మూవీ వేడుకల్లో బండ్ల గణేష్ స్పీచ్లు పిచ్చ ఫేమస్. పవన్ అభిమానులు ఉబ్బితబ్బిబయ్యేలా ఆయన ఎలివేషన్స్ ఉంటాయి. పవన్ కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకోవడం, ఆయను దేవుడిగా వర్ణించడం బండ్ల గణేష్ చేస్తూ ఉంటారు. పవన్ భక్తుడిగా ఫ్యాన్స్ బండ్ల గణేష్ ని కూడా అభిమానిస్తారు. కాగా రేపు భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. మరి ఈ వేడుకలో బండ్ల గణేష్ కనిపిస్తాడో లేదో చూడాలి.