Bheemla Nayak: అక్క‌డ ‘భీమ్లానాయక్‌’ రిలీజ్‌ లేనట్లే?

By Surya Prakash  |  First Published Feb 22, 2022, 5:04 PM IST


పవన్‌కల్యాణ్‌, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రధారులుగా సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భీమ్లానాయక్‌’. నిత్యమేనన్‌, సంయుక్త మేనన్‌ హీరోయిన్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.



‘‘నేను ఇవతల ఉంటేనే చట్టం... అవతలకొస్తే కష్టం... వాడికీ’’ అంటూ వచ్చేస్తున్నారు పవన్‌కల్యాణ్‌. తన తాజా చిత్రం ‘భీమ్లానాయక్‌’లో అదే  పాత్రలో. డేనియల్‌ శేఖర్‌తో తలపడిన ఎస్సై భీమ్లా కథ చూడటం కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ విడుదల అయ్యాక సినిమాపై ఎక్సపెక్టేషన్స్ పెరిగిపోయాయి. అలాగే రిలీజ్ కు ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. అయితే ఈ సినిమా మొదట నుంచి అనుకుంటున్నట్లుగా నార్త్ లో రిలీజ్ అవుతుందా లేదా అనే సందేహం మొదలైంది.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు...మొదట్లో ‘భీమ్లా నాయక్’ను తెలుగుతో పాటు హిందీలోనూ పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ రిలీజ్ దగ్గర పడేసరికి నిర్మాతల వద్దనుకుంటన్నట్లు సమాచారం. దానికి తోడు రీసెంట్ గా ఎటువంటి పబ్లిసిటీ లేకుండా రిలీజైన ఖిలాడి హింది వెర్షన్ కు ఖర్చులు కూడా జమ కాకపోవటం జరిగింది. దాంతో పబ్లిసిటీ లేకుండా అక్కడజ రిలీజ్ చేయటం అనవసరం అని నిర్మాతలు  ఆలోచన చేస్తునట్లు తెలుస్తోంది.  

Latest Videos

ఇప్పటిదాకా ‘భీమ్లా నాయక్’ హిందీలో రిలీజవుతుందనే అధికారిక ప్రకటన ఇప్పటిదాకా రాలేదు. దానికి తోడు ఈ శుక్రవారం అలియా భట్ నటించిన ‘గంగూబాయి కతియావాడీ’ హిందీలో భారీగా రిలీజవుతోంది. అంతేకాకుండా ‘భీమ్లా నాయక్’ ఒరిజినల్ ‘అయ్యప్పనుం కోషీయుం’ను హిందీలో రీమేక్ చేయబోతున్నారు. దాంతో ఆ  నిర్మాతల నుంచి ఒత్తిడి కూడా వస్తోంది.  వీటిన్నటి దృష్య్యా ప్రస్తుతానికి ‘భీమ్లా నాయక్’ హిందీ రిలీజ్‌ను ఆపినట్లుగా తెలుస్తోంది.  

పవన్‌కల్యాణ్‌, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రధారులుగా సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భీమ్లానాయక్‌’. నిత్యమేనన్‌, సంయుక్త మేనన్‌ హీరోయిన్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా సోమవారం రాత్రి ట్రైలర్‌ని విడుదల చేశారు.

 ‘ఒక వైల్డ్‌ యానిమల్‌కి కళ్లెం వేసినట్టు... యూనిఫామ్‌ వేసి వాణ్ని కంట్రోల్‌లో పెట్టాం, నువ్వు ఆ యూనిఫామ్‌ని తీసేశావ్‌’, ‘నాయక్‌...నీ ఫ్యాన్స్‌ వెయిటింగ్‌ ఇక్కడ’ తదితర సంభాషణలు ట్రైలర్‌లో వినిపించాయి. విధికీ, అధికారానికీ మధ్య జరిగే సంఘర్షణగా ఈ చిత్ర కథ సాగుతున్నట్టు ట్రైలర్‌ని బట్టి స్పష్టమవుతోంది. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం సమకూర్చారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ మాటలు, కథనం అందించారు.

click me!