
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ (Nithiin) - వెంకీ కుడుముల (Venky Kudumula) కాంబోలో రెండోసారి వస్తున్న చిత్రం ‘రాబిన్ హుడ్’. ప్రస్తుతం ఈ క్రేజీ ప్రాజెక్ట్ శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే వీరి కాంబోలో ‘భీష్మ’ చిత్రం వచ్చి సక్సెస్ అయిన విషయం తెలిసిందే. దీంతో ‘రాబిన్ హుడ్’ సినిమాపైన అంచనాలు నెలకొన్నాయి.
చివరిగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ప్రాజెక్ట్ నుంచి టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. గ్లింప్స్ తో నితిన్ చేస్తున్న క్యారెక్టర్ పై మంచి ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేశారు. నితిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా చాలా ఆసక్తికరంగా మారింది. నితిన్ డబ్బుకోసం దోపిడీలు చేస్తారని అప్పుడు హింట్ ఇచ్చారు. ‘డబ్బు చాలా చెడ్డది... రూపాయి రూపాయి నువ్ ఏం చేస్తావ్ అంటే? అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య చిచ్చు పెడతాను అంటాది..’ అంటూ అప్పుడు డైలాగ్ కూడా చెప్పించారు.
కానీ.. తాజాగా నితిన్ పుట్టిన రోజు (Nithiin Birthday) సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ గ్లింప్స్ మరింత ఆసక్తికరంగా మారింది. మరోవైపు ట్విస్ట్ ను కూడా క్రియేట్ చేసింది. లేటెస్ట్ గా ‘రాబిన్ హుడ్’ టీమ్ నితిన్ మరో అవతారాన్ని పరిచయం చేశారు. ఏజెంట్ ‘రాబిన్ హుడ్’ అంటూ అసలు క్యారెక్టర్ ను రిలీజ్ చేశారు. మరీ ఏజెంట్ గా విధులు నిర్వహిస్తున్న నితిన్... దోపిడీలు ఎందుకు చేశారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మున్ముందు వచ్చే అప్డేట్స్ తో దీనిపై మరింత క్లారిటీ రానుంది. ప్రస్తుతం స్పెషల్ గ్లింప్స్ మాత్రం ఆకట్టుకుంటోంది. ఇక ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు రూపొందిస్తున్నారు. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.