Intinti Gruhalakshmi: సామ్రాట్,తులసిని చూసి కుళ్ళుకుంటున్న నందు.. లాస్యకు నెక్లెస్ గిఫ్ట్ గా ఇచ్చిన నందు?

Published : Feb 15, 2023, 08:41 AM IST
Intinti Gruhalakshmi: సామ్రాట్,తులసిని చూసి కుళ్ళుకుంటున్న నందు.. లాస్యకు నెక్లెస్ గిఫ్ట్ గా ఇచ్చిన నందు?

సారాంశం

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు ఫిబ్రవరి 15వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.  

ఈరోజు ఎపిసోడ్లో తులసి ప్రేమికుల రోజు అంటే కేవలం ప్రేమికుల కోసం మాత్రమే కాదు తల్లి కొడుకుల కోసం. ప్రతి ఏడాది వాలెంటైన్స్ డే కి గులాబీ పువ్వు ఇచ్చే వాడివి కానీ ఇప్పుడు ఏమయిందో ఈ అమ్మ ప్రేమ చేదయిందేమో అనడంతో అలా మాట్లాడకు  అమ్మ అంటాడు ప్రేమ్. అప్పుడు ప్రేమ్ గులాబీ పువ్వు ఇచ్చి ఐ లవ్ యు అమ్మ అని అంటాడు. ఆ తర్వాత ప్రేమ్ పాటలు పాడుతూ ఉండగా మరోవైపు నందు తులసి ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు లాస్య పాకెట్లో నెక్లెస్ పెట్టుకొని నందు ఎంతసేపు ఇవ్వకుండా నన్ను ఊరిస్తూ ఉంటాడు అనుకుంటూ ఉంటుంది. అప్పుడు నందు ఇంతమంది కేఫ్ లో చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఇదంతా నీ ప్లానే అని తులసిని పొగుడుతూ ఉంటాడు.

అప్పుడు ఎవరు చూడడం లేదు కదా అని తులసికి నెక్లెస్ ఇచ్చేస్తాను అనుకుంటుండగా ఇంతలో లాస్య కావాలని అక్కడికి వస్తుంది. అప్పుడు లాస్య అక్కడికి రావడంతో నందు చాలా ప్లాన్ మొత్తం పాడయింది అనుకుంటూ ఉంటాడు. అప్పుడు నందు ప్రేమ్ పాటలు బాగా పాడుతున్నాడు కదా అనగా నాకోసం ఒక పాట పాడమని చెప్పు నందు అనడంతో నువ్వే వెళ్లి అడుగు అనగా నేను చెబితే పాట పాడడు అని అంటుంది లాస్య. ఇప్పుడు నా కోసం నాది నిక్లేస్ గొలుసు పాట పాడమని చెప్పు అని అంటుంది. అప్పుడు నందు ప్రేమ్ దగ్గరికి వెళ్లగా ఇంతలో అక్కడికి సామ్రాట్ వచ్చి కేఫ్ ని పొగుడుతూ ఉంటాడు. తర్వాత తులసి నందు అందరూ కలిసి గ్రూప్ ఫోటో దిగుతారు.

అప్పుడు సామ్రాట్ తులసి ప్లాన్ కి మెచ్చుకొని షేకండ్ ఇవ్వగా అది చూసి నందు కుళ్ళుకుంటూ ఉంటాడు. ప్పుడు నందు తింగరి తింగరిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అప్పుడు వెళ్ళొస్తాను అనడంతో ఒక్క నిమిషం కూర్చుని కాఫీ తెస్తాను అని కాఫీ తీసుకొని వస్తాను అని కిచెన్ లోకి వెళ్తాడు. అప్పుడు కాఫీ పెట్టడం రాక తులసి వైపు చూస్తూ ఉండగా ఇంతలో అక్కడికి లాస్య వస్తుంది. అప్పుడు నెక్లెస్ గురించి ఆలోచించమంటూ నందుకి ఇండైరెక్ట్ గా హింట్ లు ఇస్తున్న నందు ఏమీ తెలియనట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు నేను ఒక గిఫ్ట్ ఇస్తాను నాకు గిఫ్ట్ ఇవ్వాలి అని లాస్య అంటుంది. తర్వాత చూద్దాం లాస్య అని కాఫీ తీసుకుని వెళ్తాడు నందు.

ఆ తర్వాత ఒకటే కాఫీ తీసుకొని వెళ్లడంతో ఇంకొక కాఫీ తీసుకొస్తాను అనగా వద్దు మీమిద్దరం షేర్ చేసుకుంటాము అని కప్పు సాసర్లో కాఫీ తాగుతూ ఉండగా అది చూసి నందు కుళ్ళుకుంటూ ఉంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ కాఫీ తాగుతూ ఉండగా పక్కకు వెళ్లినందు వాళ్ల వైపు చూసి కుళ్ళుకుంటూ ఉంటాడు. అప్పుడు తులసి సామ్రాట్ ఇద్దరూ నందు గురించి సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత తులసి సామ్రాట్ అక్కడి నుంచి వెళ్తుండగా లాస్య అక్కడికి వచ్చి సాయంత్రం పార్టీ ఉంది తప్పకుండా రండి అని చెబుతుంది. తర్వాత అందరూ పార్టీలో కూర్చుని ఉండడంతో తులసి అందరికీ కూల్ డ్రింకులు ఇస్తూ ఉంటుంది. అప్పుడు దివ్య ఉంటే బాగుండేది అని తులసి, పరంధామయ్యలు బాధపడుతూ ఉంటారు.

తర్వాత ప్రేమ్ శృతి ఇద్దరు యాంకరింగ్ చేస్తూ ఉంటారు. అప్పుడు అందరూ సంతోషంగా గడుపుతూ ఉంటారు. అప్పుడు అందరూ సంతోషంగా మాట్లాడుకుంటూ ఉండగా లాస్య మాత్రం నందు తెచ్చిన నెక్లెస్ గురించే మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడు నందు ఈవిడకు నా మీద ప్రేమ ఎక్కువ అయింది నన్ను ఒకటి బిక్కిరి చేస్తుంది అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత గేమ్ మొదలవుతుంది. ఆ తర్వాత అభి అంకిత మొదటి చీటీ ఇవ్వగా అంకితను బ్రతిమలాడాలి అని టాస్క్ రావడంతో వాళ్ళిద్దరూ సరదాగా బ్రతిమలాడుకుంటూ ఉండగా అది చూసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు.

తర్వాత పరంధామయ్య అనసూయ దంపతులు ఓల్డ్ పాటకు డాన్స్ చేస్తూ ఉండగా అది చూసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఆ తర్వాత నందు, లాస్య వెళ్లి చీటీ తీయగా నాది నెక్కిలిసి గొలుసు అనే పాటకు డాన్స్ చేయాలి అనడంతో లాస్య మరింత సంతోష పడుతూ ఉంటుంది. అప్పుడు వారిద్దరూ సరదాగా డాన్స్ చేస్తూ ఉంటారు. అప్పుడు నందు తన జోబులో ఉన్న నెక్లెస్ ని కవర్ చేసుకుంటూ లాస్య చేస్తూ ఉంటాడు. అప్పుడు లాస్య అందరిముందు నందు గురించి చెబుతూ మొహమాటం ఎక్కువ నేనంటే నందుకు చచ్చేంత ఇష్టం. లాస్య ఏం మాట్లాడాలో తెలియక నందు నవ్వుకుంటూ ఉంటాడు. నాకోసం నందు గిఫ్ట్ తీసుకుని వచ్చాడు రెండు రోజుల నుంచి జోబులోనే పెట్టుకున్నాడు అని నెక్లెస్ గురించి చెప్పడంతో నందు మనస్సు ఒప్పక బయటికి తీస్తాడు. అప్పుడు లాస్య ఆ నెక్లేస్ చూసి సంతోష పడుతూ ఉండగా నందు కుళ్ళుకుంటూ తులసి వైపు చూసి లాస్య మెడలో ఆ నెక్లెస్ వేస్తాడు.

PREV
click me!

Recommended Stories

మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ
Bigg Boss Top 5: బిగ్‌ బాస్‌ తెలుగు 9 టాప్‌ 5 కంటెస్టెంట్లు వీరే.. ఒక్క లీక్‌తో లెక్కలన్నీ తారుమారు