మూడేళ్ల నంది అవార్డుల ప్రకటించిన ఏపీ సర్కారు

First Published Nov 14, 2017, 6:19 PM IST
Highlights
  • 2014, 2015, 2016 సంవత్సరాలకు నంది అవార్డులు ప్రకటించిన ఏపీ సర్కారు
  • ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డుకు మెగాస్టార్ చిరంజీవి పేరును ప్రకటించిన ఏపీ
  • రజినీ, కమల్, రాఘవేంద్ర రావులకు ఎన్టీఆర్ అవార్డు

సినిమా రంగంలో విశేష సేవలందించిన వారికి, మెరుగైన ప్రతిభ కనబరిచిన నటీనటులకు ఏటా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది సహా పలు ప్రతిష్టాత్మక అవార్డులను ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే విభజన నేపథ్యంలో కొంత జాప్యమైనా.. కమిటీ వేసిన సర్కారు ఈ మంగళవారం 2014, 2015, 2016 సంవత్సరాలకు నంది అవార్డులను, ఎన్టీఆర్ జాతీయ అవార్డును, బీఎన్‌రెడ్డి నేషనల్ అవార్డులను, రఘుపతి వెంకయ్య, నాగిరెడ్డి, చక్రపాణి అవార్డులను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.

 

2014లో ఉత్తమ చిత్రంగా లెజెండ్, 2015లో ఉత్తమ చిత్రం బాహుబలి బిగినింగ్, 2016లో పెళ్లి చూపులు చిత్రానికి ఉత్తమ చిత్రాలుగా నిలిచాయి. కాగా.. 2014, 2015, 2016 సంవత్సరాలకు ప్రభుత్వం ఇంతకు ముందే కమిటీలను నియమించింది . నటుడు గిరిబాబు, నిర్మాత పోకూరి బాబురావు, జీవిత రాజశేఖర్ అధ్యక్షతన మూడు కమిటీల సభ్యులు ఇప్పటికే హైదరాబాద్‌లో సినిమాలను చూశారు. కాగా అమరావతిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హీరో బాలయ్య, మురళీ మోహన్ అధ్యక్షతన ఈ అవార్డ్స్‌ను ప్రకటించారు. ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డుకు మెగాస్టార్ చిరంజీవి పేరును ప్రకటించింది ఏపీ సర్కారు.

 

ఉత్తమ చిత్రాలు.. 
2014 ఉత్తమ చిత్రం: లెజెండ్
2015 ఉత్తమ చిత్రం: బాహుబలి
2016:ఉత్తమ చిత్రం: పెళ్లి చూపులు

 

ఉత్తమ నటులు..

2014 ఉత్తమ నటుడు: బాలయ్య
2015 ఉత్తమ నటుడు: మహేష్ బాబు (శ్రీమంతుడు)
2016:ఉత్తమ నటుడు: జూనియర్ ఎన్టీఆర్

 

ఉత్తమ నటి..

2014 ఉత్తమ నటి: అంజలి (గీతాంజలి)
2015 ఉత్తమ నటి: అసుష్క(సైజ్ జీరో)


ఎన్టీఆర్ జాతీయ అవార్డులు..

2014 ఎన్టీఆర్ జాతీయ అవార్డ్: కె.రాఘవేంద్రరావు
2015 ఎన్టీఆర్ జాతీయ అవార్డ్: రజనీకాంత్
2016 ఎన్టీఆర్ జాతీయ అవార్డ్: కమల్ హాసన్‌

 

ఇతర అవార్డులు:
ఉత్తమ సహాయనటుడు నాగచైతన్య (మనం)
ఉత్తమ సహాయనటి మంచు లక్ష్మీ (చందమామ కథలు)
ఉత్తమ హాస్యనటుడు బ్రహ్మానందం (రేసు గుర్రం)
ఉత్తమ హాస్యనటి విద్యుల్లేఖ (రన్ రాజా రన్)
ఉత్తమ కెమెరామెన్ సాయిశ్రీ రామ్ (అలా ఎలా)
ఉత్తమ పాటల రచయిత చైతన్య ప్రసాద్ (బ్రోకర్2)
ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత కృష్ణవంశీ (గోవిందుడు అందరివాడేలే)

అవార్డు వివరాలతో కూడిన పూర్తి లిస్టు- http://apsftvtdc.in/films2015.pdf

click me!