తారకరత్న భార్య అలేఖ్య రెడ్డికి అస్వస్థత..!

Published : Feb 19, 2023, 05:49 PM ISTUpdated : Feb 19, 2023, 06:07 PM IST
తారకరత్న భార్య అలేఖ్య రెడ్డికి అస్వస్థత..!

సారాంశం

సినీ నటుడు తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది.

సినీ నటుడు తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తున్నట్టుగా  తెలుస్తోంది. తారకరత్న మృతితో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. భార్య అలేఖ్య రెడ్డితో పాటు, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తారకరత్నకు నివాళులర్పించేందుకు విచ్చేస్తున్న కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ  ప్రముఖులు కూడా అలేఖ్యను పరామర్శించి ఓదారుస్తున్నారు. 

అయితే తారకరత్న మరణించారని వైద్యులు ధ్రువీకరించినప్పటి నుంచి ఆమె కంటతడి ఆరడం లేదు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు  ధైర్యం చెబుతున్న తారకరత్న అకాల మరణాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు ఆహారం కూడా తీసుకోకపోవడంతో ఆమె అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తోంది. 

Also Read: తారకరత్న భౌతికకాయం వద్ద బాలకృష్ణ కంటతడి.. పరుగెత్తుకుంటూ వచ్చి బాలయ్యను హత్తుకున్న నిషిక..

అలేఖ్య అస్వస్థతకు గురైన విషయంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు స్పందించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. కొంత మానసిక ఒత్తిడికి లోనవుతుందని తెలిపారు. కాళ్లు, చేతులు కొంచెం వణకడం మొదలైందని.. అయితే అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. అమితంగా ప్రేమించిన వ్యక్తిని కోల్పోవడం చిన్న విషయం కాదని.. కొంతకాలం ఒడిదుడుకులు ఉంటాయని చెప్పారు. 

ఇదిలా ఉంటే.. తారకరత్న, అలేఖ్య రెడ్డిలు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అందులో ఇద్దరు అమ్మాయిలు కాగా, ఒక అబ్బాయి. ఇక, అలేఖ్య రెడ్డికి ఇదివరకే పెళ్లై విడాకులు తీసుకున్నారు. కామన్ ఫ్రెండ్స్‌ ద్వారా అలేఖ్య, తారకరత్నలకు పరిచయం ఏర్పడింది. వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో.. గుడిలో పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత కొంతకాలానికి ఇరు కుటుంబా పెద్దలు వీరి వివాహాన్ని అనుమతించారు. ఈ జంటకు 2013లో నిషిక అనే కూతురు జన్మించింది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఈ జంటకు కవలలు జన్మించారు. అందులో బాబుకు తనయ్‌ రామ్ అని, పాపకు రేయా అని పేర్లు పెట్టారు. 

PREV
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ప్రోమోతోనే దుమ్ములేపుతున్న `దేఖ్‌ లేంగే సాలా` సాంగ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మేనియా స్టార్ట్
2025 Top 5 Heroes: 1000 కోట్లతో టాప్‌లో ఉన్న నటుడు ఇతనే.. రిషబ్‌, మోహన్‌ లాల్‌, విక్కీ, అక్షయ్‌లకు ఝలక్‌