
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తాజాగా ఒక ఆసక్తికర ఎన్నిక జరిగింది. టాలీవుడ్ నిర్మాతల మండలికి సంబంధించిన ఎన్నికలు పూర్తయ్యాయి. టాలీవుడ్ లో పేరుకే నిర్మాతల మండలి ఉంటోంది.. కానీ ఎవరూ నిబంధనలు పాటించరు అనే విమర్శ ఉంది. ఈ తరుణంలో కొత్త నిర్మాతల మండలికి ఎన్నికలు జరిగాయి.
ఈ ఎన్నికల్లో ప్రముఖ నిర్మాత దామోదర్ ప్రసాద్ నిర్మాతల మండలి ప్రెసిడెంట్ గా విజయం సాధించారు. దామోదర్ ప్రసాద్ 339 ఓట్లు సాధించారు. మరో అభ్యర్థిగా పోటీ చిందిన జెమిని కిరణ్ 315 ఓట్లు సాధించారు. దీనితో దామోదర్ కిరణ్ 24 ఓట్లు తేడాతో విజయం సాధించారు. నిర్మాతల మండలి ఉపాధ్యక్ష పదవికి సుప్రియ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం విశేషం.
ట్రెజరర్ గా రామ సత్యనారాయణ విజయం సాధించారు. ఇక హానరబుల్ సెక్రటరీ పదవి కోసం నలుగురు పోటీ చేసారు. వీరిలో అత్యధిక ఓట్లతో తొలి రెండు స్థానాల్లో నిలిచిన ప్రసన్న కుమార్, వైవిఎస్ చౌదరి విజయం సాధించారు. ప్రసన్న కుమార్ 397 ఓట్లు, వైవిఎస్ చౌదరి 380 ఓట్లు సాధించారు.
జాయింట్ సెక్రటరీ గా భరత్ చౌదరి, నిర్మాత నట్టి కుమార్ గెలుపొందారు. ఇక ఈసీ మెంబర్స్ గా దిల్ రాజు, దివివి దానయ్య, రవికిశోర్, యలమంచి రవి, పద్మిని, బెక్కెం వేణు గోపాల్, సురేందర్ రెడ్డి, శేఖర్ రావు, అభిషేక్ అగర్వాల్ కోనసాగనున్నారు.