నందమూరి మోక్షజ్ఞ ఆరంగేట్రం శ్రావణితో..?

Published : Sep 08, 2017, 03:39 PM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
నందమూరి మోక్షజ్ఞ ఆరంగేట్రం శ్రావణితో..?

సారాంశం

తనయుడు మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ బాలకృష్ణ ప్రకటనతో అభిమానుల్లో కోలాహలం క్రిష్ దర్శకత్వంలోనే మోక్షజ్ఞ మూవీ అని, టైటిల్ ఖరారైందని సమాచారం

 

నవరసనట సార్వభౌముడు ననందమూరి తారక రామారావు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సంపాదించిన స్థానం అనిర్వచనీయం. అన్నగారి కుటుంబం నుంచి రెండో తరంలో వెండితెర వారసులుగా బాలకృష్ణ, హరికృష్ణలు ఎంట్రీ ఇవ్వగా.. మూడో తరంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు సక్సెస్ సాధించారు. ఇంకా హీరోలుగా వచ్చిన వారున్నా.. తారకరత్న లాంటి హీరోలు పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. ఇక యంగ్ టైగర్ అనే బిరుదు సంపాదించుకుని వరుస విజయాలతో ఎన్టీఆర్(జూనియర్) తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు.

 

తాజాగా మూడో త‌రం నుంచి బాలకృష్ణ త‌న‌యుడు నంద‌మూరి మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీ ఇస్తున్నాడు. కొడుకు ఎంట్రీపై బాల‌య్యే స్వ‌యంగా ప్ర‌క‌ట‌న చేయ‌డంతో అప్పుడే ఈ సినిమాపై ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ ప్రారంభ‌మైంది. 2018 జూన్ నాటికి మోక్షు సినిమా ప్రారంభం అవుతుందని బాలయ్య చెప్పారు.

 

ఇక ఈ సినిమాను బాల‌య్య‌కు స‌న్నిహితుడైన వారాహి చ‌ల‌న‌చిత్రం బ్యాన‌ర్ అధినేత సాయి కొర్రపాటి నిర్మించ‌డం దాదాపు ఖ‌రారైంది. ఇక ఈ సినిమాను క్రిష్ డైరెక్ట్ చేస్తాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. బాల‌య్య‌తో శాత‌క‌ర్ణి లాంటి సూప‌ర్ హిట్ కొట్టిన క్రిష్ ప్ర‌స్తుతం బాలీవుడ్ హీరోయిన్ కంగ‌న‌తో ఝాన్సీ లక్ష్మి భాయ్ జీవిత చరిత్ర మణికర్ణికను డైరెక్ట్ చేస్తున్నాడు.

 

ఈ సినిమా కంప్లీట్ అయిన వెంట‌నే క్రిష్ మోక్షు డెబ్యూ మూవీపై క‌స‌ర‌త్తు స్టార్ట్ చేయ‌నున్నాడు. ఇక ఈ సినిమా క‌థ కూడా శాత‌క‌ర్ణికి కొన‌సాగింపుగా ఉంటుంద‌ని టాక్‌. శాత‌క‌ర్ణి సినిమా చేస్తున్న టైంలోనే క్రిష్ బాల‌య్య‌కు శాత‌క‌ర్ణి కుమారుడు వాశిష్టీపుత్ర పులోమావి, అత‌డి ప్రేయ‌సి శ్రావ‌ణి ల‌వ్‌స్టోరీ చెప్పాడ‌ట‌. ఇప్పుడు మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ఈ బ్యూటీఫుల్ ల‌వ్‌స్టోరీతోనే తెర‌కెక్క‌నుంద‌ని తెలుస్తోంది. ఇక సినిమాకు కూడా ' శ్రావ‌ణి ' అనే టైటిల్ ఫిక్స్ చేయ‌నున్నట్టు సమాచారం.

 

PREV
click me!

Recommended Stories

Mysaa Glimpse Review: అడవిలో గర్జించిన రష్మిక మందన్న.. `మైసా` మూవీ ఫస్ట్ గ్లింప్స్ జస్ట్ గూస్‌ బమ్స్
కాంతార 1 రికార్డుకు గండి కొట్టిన ధూరందర్.. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలు ?