ఈ బౌన్సర్లకు కొవ్వెక్కువైంది.. అనవసరంగా ప్రెస్ ఫోటోగ్రఫర్లను కొట్టారు

Published : Sep 08, 2017, 02:35 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
ఈ బౌన్సర్లకు కొవ్వెక్కువైంది.. అనవసరంగా ప్రెస్ ఫోటోగ్రఫర్లను కొట్టారు

సారాంశం

ముంబైలో శిల్పా రాజ్ కుంద్రా ఫోటోలు తీసుకుంటున్న ప్రెస్ ఫోటోగ్రాఫర్స్ రెస్టారెంట్ నుంచి శిల్పా కుంద్రా దంపతులు వెళ్లిపోతున్న సందర్భంలో బౌన్సర్స్ హంగామా ఒళ్లు కొవ్వెక్కి అనవసరంగా ప్రెస్ ఫోటోగ్రాఫర్లపై విచక్షణ రహితంగా దాడి చేసిన బౌన్సర్స్ కండలు పెంచగానే కాదు... బుద్ధి కూడా పెంచాలంటున్న జర్నలిస్టులు

ముంబైలో గురువారం రాత్రి ఓ రెస్టారెంట్ కు వచ్చిన బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్‌‌కుంద్రాలను కెమెరాల్లో బంధించేందుకు ప్రయత్నించిన ఇద్దరు ఫొటోగ్రాఫర్లను బౌన్సర్లు విచక్షణా రహితంగా కొట్టారు. బాంద్రాలో ఉన్న బాస్టియన్ రెస్టారెంట్‌కు గురువారం రాత్రి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్‌కుంద్రా వెళ్లారు. డిన్నర్ అనంతరం రెస్టారెంట్ బయటికి వచ్చి మీడియా ఫొటోగ్రాఫర్లకు పోజులిచ్చారు. వాతావరణం అంతా ఖుషీ ఖుషీగా వుంది.

 

ఇంతలోనే అక్కడి నుంచి వారు బయలుదేరుతుండగా రెస్టారెంట్ బౌన్సర్లు, ఫొటోగ్రాఫర్ల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో బౌన్సర్లు ఇద్దరు ఫొటోగ్రాఫర్లను విచక్షణా రహితంగా కొట్టారు. ఈ దాడిలో హిమన్షు షిండే, సోను అనే ఇద్దరు ఫోటోగ్రాఫర్లు గాయపడ్డారు. శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రా వెళ్లడానికి వీలుగా బౌన్సర్లు దారిని క్లియర్ చేస్తున్నారు. ఈ సమయంలో ఇద్దరు ఫొటోగ్రాఫర్లు శిల్పా, కుంద్రాలకు ఫోజులివ్వాలని కోరుతూ దగ్గరగా వచ్చారు.

 

అంతే.. అదేదో పెద్ద నేరం చేసినట్లు వాళ్లపై ఆగ్రహంతో ఊగిపోయిన బౌన్సర్లు ఎడాపెడా ఫోటోగ్రాఫర్లపై పిడిగుద్దులు కురిపించారు. ఈ దాడిపై ఇద్దరూ ఫొటోగ్రాఫర్లు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరు రెస్టారెంట్ బౌన్సర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు రెస్టారెంట్ వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో దాడి వీడియోలు రికార్డయ్యాయి. ఈ వీడియోలను న్యూస్ ఏజెన్సీ ఎఎన్ఐ ట్వీట్ చేసింది. బౌన్సర్లు ఫోటోగ్రాఫర్లపై దాడి చేస్తున్నట్లు స్పష్టంగా రికార్డయింది.

 

మొత్తానికి సెలెబ్రిటీల చుట్టూ కాపలా కాయటానికి వచ్చే బౌన్సర్లు ప్రెస్ ప్రతినిధులపై తరచూ ఇలా తమ పెతాపం సూపడం జరుగుతూనే వుంటోంది. అంత అసరమా.. ఫోటోగ్రాఫర్లు వాళ్లకు పబ్లిసిటీ ఇచ్చేందుకు దున్నపోతుల చేతుల్లో దెబ్బలు తినాల్సి రావడం దురదృష్టం.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా
Demon Pavan: తాను విన్నర్ కాదని తెలుసు, రవితేజతో బేరమాడి భారీ మొత్తం కొట్టేసిన డిమాన్ పవన్.. లక్ అంటే ఇదే