లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆపేందుకు నందమూరి ఫ్యామిలీ ఏం చేస్తోందంటే..?

By Udaya DFirst Published 21, Feb 2019, 3:39 PM IST
Highlights

ఎన్టీఆర్ బయోపిక్ కు పోటీగా రాం గోపాల్ వర్మ చేస్తున్న చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఇప్పటికే విడుదలైన ఈ  సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్  అసలు కథ ఇదే అంటూ వర్మ చేస్తున్న ప్రమోషన్స్ అందరినీ ఉలికిపడేలా చేస్తున్నాయి. 

ఎన్టీఆర్ బయోపిక్ కు పోటీగా రాం గోపాల్ వర్మ చేస్తున్న చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఇప్పటికే విడుదలైన ఈ  సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్  అసలు కథ ఇదే అంటూ వర్మ చేస్తున్న ప్రమోషన్స్ అందరినీ ఉలికిపడేలా చేస్తున్నాయి.

అదే సమయంలో  బాలకృష్ణ చేస్తున్న ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా రేపు (శుక్రవారం) వస్తున్నా ఆ సినిమాకు ఏ మాత్రం బజ్ క్రియేట్ కాలేదు. కాని అదే జనం లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించి ఏ న్యూస్ వచ్చినా వదలట్లేదు. చివరకు తెలుగుదేశం అభిమానులు సైతం లక్ష్మీస్ ఎన్టీఆర్ విషయంలో ఎలర్ట్ గా ఉంటున్నారు. 

ఇదంతా గమనిస్తున్న నందమూరి కుటుంబం మండిపడుతోందిట. ఏదో విధంగా  వర్మకు చెక్ పెట్టాలని చూస్తున్నారట. సెన్సార్ ద్వారా  ఈ సినిమా రిలీజ్ ఆపేందుకు తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి. ఫిల్మ్ సర్కిల్స్  నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా రిలీజ్ ను ఆపేయాల్సిందిగా పురందేశ్వరి సెన్సార్ టీం కు ఓ లెటర్ రాసిందట. అంతేకాదు సినిమాను రిలీజ్ ముందు తమకు ఓసారి చూపించారని ఆ లెటర్ లో రాసారని తెలుస్తోంది.

అయితే రామ్ గోపాల్ వర్మ మాత్రం అందరితో పాటే ఈ సినిమా చూడాలని.. ఒకవేళ అప్పుడు ఏదైనా అభ్యంతరాలు ఉంటే చట్టపరంగా ప్రొసీడ్ అవ్వాలని వర్మ రిప్లై ఇచ్చాడని చెప్పుకుంటున్నారు.  అయితే ఈ ప్రాసెస్ అంతా సైలెంట్ గా జరుగుతుందంటున్నారు. మరో వైపు చంద్రబాబు ఈ సినిమాపై సీరియస్ గా ఉన్నారట.

సినిమాను ఆపేందుకు తనదైన స్టైల్ లో ప్లాన్ చేస్తున్నట్లు చెప్పుకుటన్నారు. అయితే ఈ సినిమా పై విమర్శలు చేయవద్దని, అనవసరంగా రచ్చ చేసి.. నందమూరి ఫ్యామిలీ ద్వారా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు మరింత పబ్లిసిటీ చేయకూడదని డెసిషన్ తీసుకున్నారట. అందుకే ఆ విషయాలన్ని  సీక్రెట్ గా ఉంచుతున్నారట. 

Last Updated 21, Feb 2019, 3:39 PM IST