సూపర్ స్టార్ మహేష్ చేతుల మీదుగా పెళ్లి సందడి ట్రైలర్ విడుదల

By team teluguFirst Published Sep 22, 2021, 12:22 PM IST
Highlights

నేడు పెళ్లి సందడి ట్రైలర్ ని సూపర్ స్టార్ మహేష్ విడుదల చేశారు. అలాగే హీరో రోషన్ తో పాటు చిత్ర యూనిట్ కి బెస్ట్ విషెష్ తెలియజేశారు. కింగ్ నాగార్జున సైతం పెళ్లి సందడి ట్రైలర్ ని విడుదల చేయడం జరిగింది.

నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పెళ్లి సందడి. కంప్లీట్ ఫ్యామిలీ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా లేడీ డైరెక్టర్ గౌరీ రోనంకి తెరకెక్కించారు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ చేయడంతో పాటు నిర్మాణ బాధ్యతలు కూడా తీసుకున్నారు. ఇక ఈ సినిమాలో రాఘవేంద్రరావు తళుక్కున మెరవడం విశేషం. 


కాగా నేడు పెళ్లి సందడి ట్రైలర్ ని సూపర్ స్టార్ మహేష్ విడుదల చేశారు. అలాగే హీరో రోషన్ తో పాటు చిత్ర యూనిట్ కి బెస్ట్ విషెష్ తెలియజేశారు. కింగ్ నాగార్జున సైతం పెళ్లి సందడి ట్రైలర్ ని విడుదల చేయడం జరిగింది. తండ్రి శ్రీకాంత్ నటించిన పెళ్లి సందడి చిత్రాన్ని తలపించేలా ట్రైలర్ కలర్ ఫుల్ గా సాగింది. చాలా కాలం తరువాత భారీ తారాగణం నటించిన ఫ్యామిలీ చిత్రం ప్రేక్షకులను పలరించనుంది. 


కామెడీ, రొమాన్స్, యాక్షన్, ఎమోషన్స్ కలగలిపి పక్కా ఫామిలీ ఎంటర్టైనర్ గా పెళ్లి సందడి తెరకెక్కినట్లు ట్రైలర్ ద్వారా అర్థం అవుతుంది. పెళ్లి సందడి చిత్రానికి కీరవాణి సంగీతం అందించగా, శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఇక దసరా కానుకగా పెళ్లి సందడి థియేటర్స్ లో సందడి చేయనుంది. హీరోగా రోషన్ కి ఇది రెండవ చిత్రం కావడం విశేషం. 
 

Extremely happy to launch the trailer of garu's silver screen debut !! Wishing him and the entire team all the very best for its release!https://t.co/KtGLmdbnI4

— Mahesh Babu (@urstrulyMahesh)
click me!