బాలకృష్ణ ఫస్ట్ అడ్వర్టైజ్ మెంట్.. తొలిసారిగా యాడ్ షూట్ కు ఒకే చెప్పిన నందమూరి నటసింహం.!

Published : Oct 22, 2022, 04:53 PM ISTUpdated : Oct 22, 2022, 04:58 PM IST
బాలకృష్ణ ఫస్ట్ అడ్వర్టైజ్ మెంట్..  తొలిసారిగా యాడ్ షూట్ కు ఒకే చెప్పిన నందమూరి నటసింహం.!

సారాంశం

40 ఏండ్లకు పైగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న నందమూరి నటసింహం, బాలకృష్ణ (Balakrishna) ఇప్పటి వరకు ఎలాంటి కమర్షియల్ యాడ్స్ లో నటించలేదు. తాజాగా ఆయన కేరీర్ లో ఫస్ట్ టైం ఓ అడ్వర్టైజ్ మెంట్ కు ఒకే చెప్పారని తెలుస్తోంది.  

బాలనటుడిగానే వెండితెరపై తెలుగు ప్రేక్షకులను అలరించాడు నందమూరి నటసింహం, టాలీవుడ్ సీనియర్ నటుడు బాలకృష్ణ. 46 ఏండ్లుగా వరుస చిత్రాల్లో నటిస్తూనే వస్తున్నారు. ఇప్పటికీ బ్లాక్ బాస్టర్ చిత్రాలతో దుమ్ములేపుతున్నారు. టాప్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న బాలయ్య లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు.   అప్పటి తెలుగు హీరోల్లో నెంబర్ గా నిలిచారు.  జానపద, పౌరాణిక, సాంఘిక, చారిత్రక చిత్రాలలో నటించి తెలుగు సినీ గడ్డపై తనదైన ముద్ర వేసుకున్నారు బాలకృష్ణ. 

ప్రస్తుత పరిస్థితులు మారుతుండటం.. బాలకృష్ణ క్రేజ్ అంతకంతకు పెరుగుతుండటంతో కొన్ని కీలక మార్పులు తీసుకుంటున్నారు. ఇప్పటికే బుల్లితెరపై ‘అన్ స్టాపబుల్’ టాక్ షోతో వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఊహించని విధంగా ఈ షో రేటింగ్ ను పెంచేశాడు. ఈ షోతో బాలయ్య నడుచుకున్న తీరుతో అభిమానులకు, ఆడియెన్స్ కు మరింత నచ్చేశారు బాలయ్య. ఈక్రమంలో బాలకృష్ణ తాజాగా అడ్వర్టైజ్ మెంట్ ప్రపంచంలోకి కూడా అగుడుపెట్టినట్టు తెలుస్తోంది. 

తాజాగా కమర్షియల్ యాడ్ లో నటించేందుకు ఒప్పుకున్నట్టు సమాచారం అందింది. ప్రముఖ సాయి ప్రియా గ్రూప్ (Sai Priya Group) సంస్థ బ్రాండ్ అంబాసిడర్ గా  బాలకృష్ణను ఎంపిక చేశారని తెలుస్తోంది ఈ సంస్థలోని ప్రాడక్ట్స్ ను ప్రమోట్ చేసేందుకు శ్రేయాస్ గ్రూప్ మరియు బ్రాండ్ ఈ డిజిటల్ వారు యాడ్స్ ను క్రియేట్ చేస్తున్నారు. వీరి ఆధ్వర్యంలో బాలయ్య తొలిసారిగా యాడ్ షూట్ లో నటించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా సాయి ప్రియా గ్రూప్ సంస్థ ఎన్బీకేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిందంట.  

అయితే, హీరోగా బాలకృష్ణ 110కిపైగా చిత్రాల్లో నటించినా ఇప్పటి వరకు కమర్షియల్ యాడ్స్ లో నటించలేదు. ఇందుకు కారణంగా.. బాలయ్య తండ్రి, సీనియర్ ఎన్టీఆర్ అనే గతంలో చెప్పుకొచ్చారు. తన తండ్రి ఇమేజ్ ఆసరాగా చేసుకొని ఏనాడు యాడ్ ఫిల్మ్స్ లో నటించలేదని,తానూ ఆయన బాటలోనే నడుస్తున్నట్టు తెలిపారు. నటుడిగా వచ్చిన క్రేజ్ ప్రేక్షకులు ఇచ్చిందని, వారిని వెండితెరపై అలరించి ఆనందం పొందాలే తప్పా.. యాడ్స్ కోసం వినియోగించడం సరికాదని అపట్లో అభిప్రాయపడ్డారు. ఏదైమైనా అడ్వర్టైజ్ మెంట్ రంగంలోకి అడుగెట్టడంతో అభిమానులు మాత్రం ఖుషీ అవుతన్నారు. ప్రస్తుతం బాలయ్య ‘వీరసింహారెడ్డి’ (Veera Simha reddy)లో నటిస్తున్నారు. గోపీచంద్ మాలినేని దర్శకత్వం వహస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

సంక్రాంతి సినిమాల రేసులో ట్విస్ట్, ఆడియన్స్ కు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఏంటో తెలుసా?
Gunde Ninda Gudi Gantalu Today:తల్లికి ఎదురు తిరిగిన మనోజ్.. షాక్ లో ప్రభావతి, మనోజ్ చెంపలు వాయించిన బామ్మ