
బుల్లి తెర బ్యూటీ అష్షు రెడ్డి అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఫ్యాన్స్ జూనియర్ సమంతగా ఆరాధించే అభిమాను సోషల్ మీడియా స్టార్ హాస్పిటల్ లోచేరింది. ఆరోగ్యం పాడవడంతో హాస్పిటల్ పాలు అయ్యింది అష్ణు. ఇంతకీ అష్షు రెడ్డికి ఏమయ్యింది...?
ప్రముఖ బుల్లి తెర స్టార్... బిగ్ బాస్ ఫేమ్.. సోషల్ మీడియా సెలబ్రిటీ.. జూనియన్ సమంత గా పేరుగాంచిన ఇన్స్టాగ్రామర్, బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 కంటెస్టెంట్ అషు రెడ్డి ఆసుపత్రిలో చేరింది. కొన్ని అనారోగ్య కారణాలతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అష్ణు ట్రీట్మెంట్ తీసుకుంటుంది. సడెన్ గా ఆమె హాస్పిటల్ లో చేరింది అని తెలియడంతో అభిమానులు కంగారు పడుతున్నారు. అష్ణుకీ ఏమైయ్యిందా అని ఆరా తీస్తున్నారు.
ఇక ఇది ఇలా ఉంటే.. రోవైపు ఆసుపత్రిలో ఉన్న అషు రెడ్డిని బిగ్ బాస్ ఫేమ్.. మరో సోషల్ మీడియా సెలబ్రిటీ అరియానా గ్లోరీ పరామర్శించింది. హాస్పిటల్ కు వచ్చిన ఆమె.. అష్ణు ఆరోగ్యపరిస్థితి గురించి అడిగి తెలుసుకుంది. అష్ణు త్వరగా కోలుకోవాలని కోరుకుంది అరియానా. ఇక ఈ విషయాన్ని అషు రెడ్డి తన సోషల్ మీడియా పేజ్ లో షేర్ చేసుకుంది. తనకు బాగోలేదు అనగానే వెంటనే ఆసుపత్రికి వచ్చినందుకు అరియానాకు అషు రెడ్డి కృతజ్ఞతలు కూడా తెలిపింది.
టిక్ టాక్ వీడియోలతో భాగా ఫేమస్ అయ్యింది అష్షు రెడ్డి. ఆ ఇమేజ్ తో బిగ్ బాస్ సీజన్ 3లో సందడి చేసింది. కాని టైటిల్ గెలవలేక పోయింది. కాని బిగ్ బాస్ వల్ల బుల్లి తెరపై అడుగు పెట్టి.. చేతినిండా సంపాదించుకుంటుంది. ఇక రీసెంట్ గా బిగ్ బాస్ ఓటీటీలో కూడా సందడి చేసింది అష్షు రెడ్డి. ఓటీటీ బిగ్ బాస్ నుంచి కూడా సగంలోనే బయటకు వచ్చేసింది. ప్రస్తుతం టీవీ ప్రోగ్రామ్స్ తో పాటు యాంకరింగ్ చేస్తూ.. అప్పుడప్పుడూ సినిమాలు చేస్తూ ఉంది.
ఆర్జీవితో అష్ణు రెడ్డి చేసిన ఇంటర్వ్యూతో బాగా ఫేమస్ అయ్యింది అష్ణు రెడ్డి. రామ్ గోపాల్ వర్మతో బాగా క్లోజ్ గా మూవ్ అవుతుంది. అందుకే ఆమె బిగ్ బాస్ హౌస్ లో ఉండగా ఆయన సపోర్ట్ కూడా చేశాడు. ఇక బిగ్ బాస్ ఫేమ్ రాహుల్ తో డేటింగ్ చేస్తోంది బ్యూటీ. మంచి ప్రెండ్స్ అని చెప్పుకుంటూనే లవ్ ట్రాక్ నడుపుతోందట.