డీఏవీ పబ్లిక్ స్కూల్ ఘటనపై శేఖర్ కమ్ముల ఎమోషనల్ కామెంట్స్.. నిస్సహాయతతో ఉన్నా..

By team teluguFirst Published Oct 22, 2022, 2:09 PM IST
Highlights

సెన్సిబుల్ చిత్రాలతో అలరించే శేఖర్ కమ్ముల టాలీవుడ్ లో విభిన్నమైన దర్శకుడు. శేఖర్ కమ్ముల చిత్రాలు సింపుల్ ఎమోషన్ తో కట్టిపడేసే విధంగా ఉంటాయి.

సెన్సిబుల్ చిత్రాలతో అలరించే శేఖర్ కమ్ముల టాలీవుడ్ లో విభిన్నమైన దర్శకుడు. శేఖర్ కమ్ముల చిత్రాలు సింపుల్ ఎమోషన్ తో కట్టిపడేసే విధంగా ఉంటాయి. శేఖర్ కమ్ముల తరచుగా తన సోషల్ మీడియాలో సామజిక అంశాలపై కూడా స్పందిస్తూ ఉంటారు. సమాజం పట్ల తన ప్రేమ, బాధ్యత చూపిస్తుంటారు. 

ఇటీవల హైదరాబాద్ లో నాలుగేళ్ళ చిన్నారిపై డీఏవీ పబ్లిక్ స్కూల్ లో జరిగిన లైంగిక దాడి సంఘటన అందరిని షాక్ కి గురి చేసింది. ఆ స్కూల్ ప్రిన్సిపాల్ కారు డ్రైవరే చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ స్కూల్ గుర్తింపు రద్దయ్యేలా ప్రస్తుతం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 

ఈ సంఘటనపై శేఖర్ కమ్ముల సోషల్ మీడియాలో స్పందించారు. డీఏవీ స్కూల్ లో నాలుగేళ్ళ చిన్నారిపై ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడడం ఘోరమైన చర్య. ఆ చిన్నారి పడిన వేదనని ఊహించలేకపోతున్నా. నిస్సహాయతలో ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. 

ధైర్యంగా న్యాయపోరాటం చేస్తున్న చిన్నారి తల్లిందండ్రులకు నా సెల్యూట్. పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు రాజీపడకూడదు. రాజీ పడితే భయంకరమైన సమాజం రూపొందించిన వారం అవుతాం. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకోవాలి అని శేఖర్ కమ్ముల సోషల్ మీడియాలో ఎమోషనల్ కామెంట్స్ చేశారు. 

సినిమాల విషయానికి వస్తే శేఖర్ కమ్ముల ప్రస్తుతం ధనుష్ తో ఒక చిత్రం తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. 

 

pic.twitter.com/JLpFVpRLLp

— Sekhar Kammula (@sekharkammula)
click me!