వైరల్ అవుతున్న బాలకృష్ణ న్యూ స్టిల్, పండగ చేసుకుంటున్న నటసింహం అభిమానులు

Published : Aug 28, 2022, 09:14 PM ISTUpdated : Aug 28, 2022, 09:15 PM IST
వైరల్ అవుతున్న బాలకృష్ణ న్యూ స్టిల్, పండగ చేసుకుంటున్న నటసింహం అభిమానులు

సారాంశం

అఖండ సినిమా అఖండ విజయంతో  జోరుమీద ఉన్న బాలయ్య.. మలినేని గోపీచంద్ తో సినిమాను సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నారు. ఇక ఈక్రమంలో షూటింగ్ స్పాట్ నుంచి  బాలయ్య న్యూలుక్ ఫ్యాన్స్ ను దిల్ ఖుష్ చేసింది.   

నటసింహం నంద‌మూరి హీరో బాల‌కృష్ణ , గోపీచంద్ మ‌లినేని  క్రేజీ కాంబినేష‌న్ లో రూపొందుతున్న సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా సాగుతోంది. ఎన్‌బీకే 107 అనే వర్కింట్ టైటిల్ తో తెరకెక్కుతున్న మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ మూవీలో శృతిహాస‌న్ బాలయ్య సరసన  హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్ప‌టికే రిలీజైన ఎన్‌బీకే 107 ఫ‌స్ట్  టీజ‌ర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించింది. ఇక ఈమూవీ  బాక్సాఫీస్  రికార్డులు బ్లాస్ట్ చేస్తుందంటూ సందడి చేస్తున్నారు ఫ్యాన్స్. ఈక్రమంలోనే బాలయ్య సినిమా షూటింగ్ స్పాట్ నుంచి ఓ అప్ డేట్ వచ్చేసింది. 

బాల‌కృష్ణ‌, గోపీచంద్ టీం ప్ర‌స్తుతం ట‌ర్కీ షూటింగ్ షెడ్యూల్ తో బిజీగా ఉంది. ఈ సినిమా డైరెక్ట‌ర్ ఆఫ్ ఫొటోగ్ర‌ఫీ రిషీ పంజాబీ (బాల‌కృష్ణ‌తో క‌లిసి విక్ట‌రీ సింబ‌ర్ చూపిస్తూ ఫొటో దిగారు. సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా..నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. ఈ ఫోటో చూసిన బాలయ్య ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. ఇక ఈ మూవీలో  క‌న్న‌డ స్టార్ యాక్ట‌ర్ ధునియా విజ‌య్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు. కోలీవుడ్ భామ వ‌ర‌లక్ష్మి శ‌ర‌త్ కుమార్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది.

 

 

మైత్రీ మూవీ మేక‌ర్స్ భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్న Nbk 107 కి  థ‌మ‌న్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌. అఖండ సినిమాకు అదరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు తమన్. ఇక అదే రేంజ్ లో మరో సారి   థ‌మ‌న్  అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్న‌ట్టు టీజ‌ర్ చూస్తే తెలిసిపోతోంది.  రాయ‌లసీమ బ్యాక్‌డ్రాప్‌లో జ‌రిగిన కొన్ని వాస్త‌వ సంఘ‌ట‌న‌ల‌ ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కుతున్న‌ట్టు టాక్‌.మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఎంత వరకూ నందమూరి ఫ్యాన్స్ ను అలరిస్తుందో చూడాలి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

49 ఏళ్ల వయసులో ఇండియాకు మెడల్ సాధించిన నటి, ఏకంగా 4 పతకాలతో మెరిసిన ప్రగతి
Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?