రీరిలీజ్ కు రామ్ చరణ సూపర్ హిట్ మూవీ, మెగాపవర్ స్టార్ కు బర్త్ డే గిఫ్ట్

Published : Mar 07, 2024, 05:40 PM IST
రీరిలీజ్ కు రామ్ చరణ సూపర్ హిట్ మూవీ, మెగాపవర్ స్టార్ కు బర్త్ డే గిఫ్ట్

సారాంశం

ఈమధ్య రీరిలీజ్ ల ట్రెండ్ బాగా పెరిగిపోయింది. స్టార్ హీరోల సినిమాలు.. అకేషన్ ను బట్టి రీరిలీజ్ చేసేస్తున్నారు. ఇప్పటికే చాలామంది స్టార్స్ సినిమాలు రీరిలీజ్ అవుతుండగా..తాజాగా రామ్ చరణ్ సినిమా రీరిలీజ్ కు రెడీ అవుతోంది.   

ప్రస్తుతం రీరిలీజ్ ల ట్రెండ్ గట్టిగా నడుస్తోంది. స్టార్ హీరోల సినిమాలు వరుసగా రీరిలీజ్ అవుతున్నాయి.మంచి రెస్పాన్స్ రావడంతో మేకర్స్ కూడా ఎక్కడెక్కడో మూలన ఉన్న సినిమాలకు ముస్తాబు చేసి... రీ రిలీజ్ పేరిట థియేటర్లలోకి వదులుతున్నారు. దాంతో .. ఫ్యాన్స్ కు థ్రిల్.. మేకర్స్ కు మనీ ఫుల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ ట్రెండ్ విపరీతంగా నడుస్తోంది. 

రిజల్ట్ తో కూడా సంబంధం లేకుండా ఆ సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్న రామ్ చరణ్  నటించిన నాయక్  మూవీ ని కూడా రీరిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 27వ తేదీన రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా రీరిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.  ఈ సినిమాకు రీరిలీజ్ లో ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

నాయక్ మూవీ 2013 సంవత్సరం జనవరి నెల 9వ తేదీన రిలీజై అప్పట్లో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. వి.వి.వినాయక్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం. నాయక్ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో నటించగా  కాజల్, అమలాపాల్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. ఇక గ్లోబల్ స్టార్ గా వెలిగిపోతున్న రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్  సినిమాతో బిజీగా ఉన్నాడు. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న  ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. 


 

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?