ప్రయోగాలకు ఆయన మారుపేరు.. కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించిన బాలకృష్ణ దంపతులు.. కుటుంబ సభ్యులకు ఓదార్పు..

By Sumanth KanukulaFirst Published Nov 16, 2022, 11:52 AM IST
Highlights

సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయానికి ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ దంపతులు నివాళుర్పించారు. కృష్ణ తనయుడు మహేష్‌బాబుతో పాటుగా ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు. 

సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయానికి ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ నివాళుర్పించారు. తన సతీమణి వసుంధర దేవి, కూతరు నారా బ్రహ్మిణి‌లతో కలిసి పద్మాలయా స్టూడియోకు చేరుకున్న నందమూరి బాలకృష్ణ.. కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించారు. కృష్ణ తనయుడు మహేష్‌బాబుతో పాటుగా ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. కృష్ణ డ్యాషింగ్, డేరింగ్, డైనమిక్ అని అన్నారు. ఆయన లేరన్నది నమ్మలేని నిజం అని పేర్కొన్నారు.

ఆయన సాహసాలకు, ప్రయోగాలకు మారుపేరని చెప్పారు. చలనచిత్ర రంగానికి ఎనలేని సేవలు చేశారని గుర్తుచేశారు. మొదటి  కౌ బాయ్, మొదటి సినిమా స్కోప్, 70 ఏంఏం.. ఇలా కొత్త ఏ టెక్నిక్ వచ్చిన తెలుగు చిత్ర పరిశ్రమకు తీసుకెచ్చేవారని అన్నారు. ఒక్క నటుడిగా, దర్శకుడిగానే కాకుండా పద్మాలయ స్టూడియోను స్థాపించి ఎన్నో మంచి సినిమాలు తీశారని చెప్పారు. సాంఘిక, జానపద, చారిత్రత్మక.. అన్ని సినిమాల్లో కూడా ఆయన నటించారని గుర్తుచేసుకనున్నారు. అందరి హృదయాల్లో కూడా చెరగని విధంగా ముద్ర వేశారని చెప్పారు. 

చలనచిత్ర పరిశ్రమ బాగుండాలని ఆయన ఎప్పుడూ కోరుకునే వారని చెప్పారు. ఆయన నిర్మాతల పాలిట కల్పతరువు, కల్పవృక్షం అని అన్నారు. కొత్త నిర్మాతలను, దర్శకులను ఎక్కువగా పరిచయం ఎన్టీఆర్, కృష్ణలేనని చెప్పారు. తాను కృష్ణతో సుల్తాన్ సినిమా చేయడం జరిగిందని.. ఆ సమయంలో ఆయన ఎన్ని విషయాలు షేర్ చేసుకున్నారని తెలిపారు. ఈ కుటుంబంలో ఒకదాని తర్వాత ఒకటిగా ఇలాంటి దుర్ఘటనలు చోటుచేసుకోవడం బాధకరమన్నారు. కుటుం సభ్యులంతా ధైర్యంగా ఉండాలన్నారు. 

ఇక, మధ్యాహ్నం వరకు సూపర్‌స్టార్ కృష్ణ భౌతికకాయాన్ని పద్మాలయా స్టూడియోలోనే ఉంచనున్నారు. మధ్యాహ్నం కృష్ణ అంతిమయాత్ర ప్రారంభం కానుంది. పద్మాలయా స్టూడియోలో కొన్ని ఆచార కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం.. అక్కడి నుంచి జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానం వరకు అంతిమ యాత్ర సాగనుంది. మహాప్రస్థానంలో తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించనున్నారు. 
 

click me!