రెండేళ్ళు బ్రేక్ తీసుకోబోతున్న అమీర్ ఖాన్, కారణమేంటో తెలుసా..?

Published : Nov 16, 2022, 11:08 AM IST
రెండేళ్ళు బ్రేక్ తీసుకోబోతున్న అమీర్ ఖాన్, కారణమేంటో తెలుసా..?

సారాంశం

ఈమధ్య ఫిల్మ్ స్టార్స్ కాస్త విరామం కోరుకుంటున్నారు. ఎప్పుడూ పని పని పనీ... జీవితం బోర్ కొట్టేసిందో ఏమిటో.. కాస్త ప్రోఫిషన్ కు దూరంగా ఉంటూ.. కొత్త జీవితాన్నిచూడాలి అనకుంటున్నారు. ఈక్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూడా కాస్త బ్రేక్ తీసుకోవాలి అనకుంటున్నారట. కారణం ఏంటీ అంటే..? 

ఈమధ్య ఫిల్మ్ స్టార్స్ కాస్త విరామం కోరుకుంటున్నారు. ఎప్పుడూ పని పని పనీ... జీవితం బోర్ కొట్టేసిందో ఏమిటో.. కాస్త ప్రోఫిషన్ కు దూరంగా ఉంటూ.. కొత్త జీవితాన్నిచూడాలి అనకుంటున్నారు. ఈక్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూడా కాస్త బ్రేక్ తీసుకోవాలి అనకుంటున్నారట. కారణం ఏంటీ అంటే..? 


బాలీవుడ్‌ లో మిస్టర్ పర్ఫెక్ట్  పేరు ఉన్న హీరో అమీర్ ఖాన్. టాప్ టాలెంటెడ్‌ హీరోల్లో ఒకరు అమీర్‌ఖాన్ . ఇండియాలో ప్రయోగాత్మక సినిమాలు చేసే హీరోలు చాలా తక్కువ. ఎక్కువగా కమర్షియల్ సినిమాలు మాతరమే చేస్తుంటారు. అటువంటిది.. డబ్బుతో సంబందం లేకుండా.. సినిమాల పర్ఫెక్ట్ గా వస్తే చాలా సంతృప్తి పడతాడు అమీర్ ఖాన్. ఆ గుణం అమీర్ ఖాన్ ను మిస్టర్ పర్ఫెక్ట్ ను చేసింది. ఆయన చేసిన దంగల్ సినిమా ప్రపంచ రికార్డ్ లను సృష్టించింది.  కాని ఈ మధ్య అమీర్ ఖాన్ కు కలిసి రావడంలేదు. అమీర్‌ ఖాన్‌ నటించిన లాల్‌ సింగ్ చడ్డా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాగా.. బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌ టాక్‌ మూటగట్టుకుంది. 

ఎంతో కష్టపడి చేసినా ఈ సినిమా మాత్రం అమీర్‌ఖాన్‌కు తీవ్ర నిరాశనే మిగిల్చింది. నిర్మాతలకు కోట్లలో నష్టాలను తెచ్చిపెట్టింది.ఈ సినిమా ఫెయిల్యూర్‌ అమీర్‌ ఖాన్‌ ఆలోచనల్లో మార్పు తీసుకొచ్చినట్టు  తెలుస్తోంది. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో నర్మగర్భంగా చెప్పారు అమీర్ ఖాన్. అందుకే నెక్ట్స్  సినిమాల విషయంలో నిర్ణయాలను మార్చుకున్నట్టు సమాచారం. 

అమీర్ ఖాన్ ప్రస్తుతం  చాంపియన్స్ అనే సినిమా చేయాల్సి ఉంది. అయితే  ఆ సినిమాలో నటించడం లేదు మిస్టర్ పర్ఫెక్ట్. కేవలం నిర్మాణ బాధ్యతలను మాత్రమే చూసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు రెండేళ్లు సినిమాలకు విరామం తీసుకుని తన ఫ్యామిలీతో గడపాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

మరీ ముఖ్యంగా తన తల్లితో ఎక్కువ సమయం గడపాలని ఆయన నిర్ణననచించున్నాడట.  అనారోగ్యంతో రీసెంట్ గా హాస్పిటల్ లో చేరింది అమీర్ మాతృమూర్తి. అందుకే ఆమె పక్కనే ఉండి... చూసుకోవాలి అని అమీర్ ఇంటర్వ్యూలో  చెప్పాడు. ఇన్నాళ్లూ తన పిల్లలకు సరైన సమయం కేటాయించ లేకపోయాయని, ఇపుడు ప్రశాంతమైన క్షణాలను గడిపే సమయం వచ్చిందన్నారు.

మర అమీర్ ఖాన్ రెండేళ్లు విరామం తీసుకుంటారా..? లేక ఇంకా ఎక్కువ కాలం నటనకు బ్రేక్ తీసుకుంటారా..? అనేది చూడాలి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి
Nayanam Review:తండ్రి వయసు వ్యక్తితో పెళ్లి, భర్తను చింపేసిన భార్య వరుణ్ సందేశ్ ‘నయనం’ ఎలా ఉంది?