నేను అభిమన్యుడి టైపు..అభిమానులని కొట్టడంపై బాలయ్య రియాక్షన్, ఇదేం సమాధానం బాబోయ్

By tirumala AN  |  First Published Sep 30, 2024, 11:02 AM IST

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఎన్బీకే 109 చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ లో కానీ, సంక్రాంతికి కానీ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు బాలకృష్ణ పాలిటిక్స్ లో కూడా బిజీగా ఉన్నారు.


నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఎన్బీకే 109 చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ లో కానీ, సంక్రాంతికి కానీ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు బాలకృష్ణ పాలిటిక్స్ లో కూడా బిజీగా ఉన్నారు. హిందూపురం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రీసెంట్ గా బాలయ్య ఐఫా అవార్డుల వేడుకలో పాల్గొన్నారు. అబుదాబిలో చాలా గ్రాండ్ గా ఐఫా అవార్డుల వేడుక జరిగింది. 

ఐఫా వేడుకలో చిరు, బాలయ్య, వెంకటేష్ 

టాలీవుడ్ నుంచి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలు హాజరయ్యారు. బాలయ్య ఎక్కడ ఉన్నా తన మార్క్ కామెంట్స్ తో హైలైట్ అవుతారు. ఐఫా అవార్డుల వేడుకలో బాలకృష్ణ తన ఫ్యాన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ పబ్లిక్ లో ఉన్నప్పుడు కాస్త అగ్రెసివ్ గా ఉంటారు. కొన్ని సందర్భాల్లో తన అభిమానులని కొట్టారు కూడా. ఫ్యాన్స్ పై బాలయ్య చేయి చేసుకోవడంపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత అదంతా మామూలు అయిపోయింది. 

చెంపదెబ్బ కాదు, అది బాలయ్య ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ 

Latest Videos

ఐఫా అవార్డుల వేడుకలో బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ బాలయ్యని ఆసక్తికర ప్రశ్న అడిగారు. అంతా మిమ్మల్ని చూసి ఎందుకు భయపడతారు అని ప్రశ్నించారు. బాలయ్య నవ్వుతూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఫ్యాన్స్ నన్ను అమితంగా ప్రేమిస్తారు. నేను కూడా వాళ్ళ పట్ల ప్రేమ చూపిస్తాను. కొన్నిసార్లు అభిమానుల ప్రేమ శృతి మించుతుంది. చిరాకు తెప్పిస్తారు. అలాంటప్పుడు వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ తప్పదు అంటూ బాలయ్య తెలిపారు. 

రిటర్న్ గిఫ్ట్ అంటే బాలయ్య దృష్టిలో చెంపదెబ్బ. చాలా సందర్భాల్లో బాలయ్య ఫ్యాన్స్ ని కొట్టిన దృశ్యాలు బాగా వైరల్ అయ్యాయి. తాజాగా తాను ఫ్యాన్స్ ని కొడతాననే విషయాన్ని అంగీకరించారు.  బాలయ్యకి మరో ప్రశ్న కూడా ఎదురైంది. జై బాలయ్య అనే నినాదాన్ని మొట్ట మొదటి సారి ఎప్పుడు విన్నారు అని ప్రశ్నించారు. దీనికి బాలయ్య ఇచ్చిన సమాధానం కాస్త వింతగానే ఉంది. 

తాను అభిమన్యుడు టైపు అంటున్న బాలయ్య 

నేను అభిమన్యుడి టైపు.. తల్లి గర్భంలో ఉన్నప్పుడే జై బాలయ్య నినాదాన్ని విన్నానని చెప్పడం కాస్త విడ్డూరమే. బాలయ్య సరదాకి చెప్పినా ఇది కాస్త ఓవర్ గా ఉందని అంటున్నారు. జై బాలయ్య అనే నినాదం బాగా ఫేమస్ అయిపోయింది. చాలా చోట్ల ఫ్యాన్స్ జై బాలయ్య అంటూ గట్టిగా కేకలు పెడుతూ అరవడం చూస్తూనే ఉన్నాం. 

సినిమాల విషయానికి వస్తే బాలయ్య హ్యాట్రిక్ విజయాలతో మంచి జోష్ మీద ఉన్నారు. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి ఇలా వరుస హిట్లతో హ్యాట్రిక్ కొట్టారు. అఖండ చిత్రం బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు బోయపాటి అఖండ 2 చిత్రానికి రెడీ అవుతున్నారు.  వీరసింహా రెడ్డి చిత్రంలో బాలయ్య తన వింటేజ్ మాస్ యాక్షన్ చూపించారు. ఇక భగవంత్ కేసరి చిత్రం మంచి మెసేజ్ తో బాలయ్య మార్క్ యాక్షన్ ఉంటూనే ఆకట్టుకుంది. బాలయ్య సినిమాల్లో రాజకీయాల్లో బిజీగా ఉంటూనే బుల్లితెరపై హోస్ట్ గా కూడా అలరిస్తున్నారు. 

ఆహా ఓటిటిలో ప్రసారం అయ్యే అన్ స్టాపబుల్ షోకి బాలయ్య హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో అన్ స్టాపబుల్ సీజన్ 3 ప్రారంభం కాబోతోంది. తొలి రెండు సీజన్లు సూపర్ సక్సెస్ అయ్యాయి. దీనితో మూడవ సీజన్ పై ఆసక్తి నెలకొంది. ఫస్ట్ ఎపిసోడ్ కి దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి అతిథులుగా హాజరు కాబోతున్నారట. వీళ్లిద్దరి కాంబినేషన్ లో లక్కీ భాస్కర్ చిత్రం తెరకెక్కుతోంది. 

బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ 

నందమూరి ఫ్యాన్స్ మరో ట్రీట్ కోసం ఎదురుచూస్తున్నారు. బాలయ్య తనయుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ తొలి చిత్రం తెరకెక్కబోతోంది. ఆల్రెడీ అనౌన్స్ మెంట్ వచ్చింది. ప్రశాంత్ వర్మ హను మాన్ చిత్రంతో పాన్ ఇండియా వైడ్ గా గుర్తింపు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అంతకి మించేలా విజువల్ ఎఫెక్ట్స్ ఉండే భారీ కథని మోక్షజ్ఞ కోసం ప్రశాంత్ వర్మ సిద్ధం చేశారట. ఈ కథపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ చిత్ర కథ మహాభారతంలోని ఒక వీరుడు చుట్టూ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మోక్షజ్ఞ ఆ వీరుడిగా కనిపిస్తాడా లేక హను మాన్ తరహాలో సాధారణ యువకుడిగా ఉంటూ ఆ వీరుడి నుంచి స్ఫూర్తి పొందుతాడా అనేది చూడాలి. 

బాలయ్య తనయుడు తొలి చిత్రమే భారీ స్థాయిలో ఉండబోతోంది. ఐఫా అవార్డుల వేడుకలో తన వారసుల గురించి కూడా బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. మీ వారసులు ఎవరు అని ప్రశ్నించగా.. నా వారసులు ఇంకెవరు నా కొడుకు, మనవడే అని సమాధానం ఇచ్చారు. 

click me!