ఈ సినిమాతో ఎన్టీఆర్ ప్యాన్ ఇండియా స్టార్ గా ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పటికే తెలుగుతో పాటు హిందీ, కన్నడలో ఈ మూవీ ఇరగదీస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో దేవర హవా నడుస్తోంది. మొన్న శుక్రవారం రిలీజైన ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకున్నా తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతంది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజే 100 కోట్ల కలెక్షన్స్ సాధించిన స్టార్ల లిస్టులో జూనియర్ ఎన్టీఆర్ కూడా చేరిపోయారు. ఓ రకంగా దేవర సినిమా ఎన్టీఆర్ స్టామినా ఏంటో చెప్పి కెరీర్‌ను కొత్త మలుపు తిప్పింది. ప్రభాస్ ఇటీవలి చిత్రం కల్కి 2898ఏడీ సినిమా తరువాత దేవర వరల్డ్ వైడ్ కలెక్షన్లలో రెండో స్థానంలో నిలిచింది.
దేశవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా మొదటి రోజునే 8,000 షోలు వేశారు. ఇందులో 4,200 తెలుగు వెర్షన్ షోలు. ఆ తరువాత హిందీ దేవర 3,200 షోస్ వేశారు. ఒక్క హైదరాబాద్‌లోనే దేవర సినిమా మొదటి రోజున 1,726 షోలు వేశారు. ఫస్ట్ డే 100 కోట్ల క్లబ్‌లో జూనియర్ ఎన్టీఆర్ రూ. 140 కోట్ల అఫిషియల్ కలెక్షన్స్ సాధించిన దేవర చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ సోలోగా ఫస్ట్ డే 100 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించిన స్టార్ల జాబితాలో చేరిపోయారు. అయితే అదే సమయంలో ఓ వివాదం ఈ సినిమాపై వచ్చింది. అభిమానులు అత్యుత్సాహంతో చేసిన కొన్ని పనులు మేకర్స్ ని ఇబ్బందుల్లో పడేస్తాయి.
ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవర సినిమా రిలీజ్ తో పండుగ చేసుకున్నారు. అదే క్రమంలో చాలా చోట్ల థియేటర్ అద్దాలు, పగులగొట్టడం, ప్రమాదవశాత్తు సుదర్శన్ థియేటర్‌లో దేవర ఫ్లెక్లీ కాలిపోవడం వంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. అవన్నీ ప్రక్కన పెడితే... సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో మాత్రం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. హిరోయిన్ వేదిక కూడా ఈ వీడియో పై స్పందించింది. ఏంటీ ఘోరం ఇకనైనా ఆపండి అంటూ పోస్టు కూడా పెట్టింది. ఇంతకీ ఏముందా వీడియోలో.
ఆ వీడియోలో ఏముంది అంటే, ఓ థియేటర్ వద్ద దేవర ఫ్యాన్స్ మేకను బలిచ్చారు. ఆ వీడియో చూసి ఆమె స్పందించారు. ఏంటీ ఘోరం ఇకనైనా ఆపండి. చూస్తేనే భయంకరంగా ఉంది ఆ అమాయకపు మూగజీవి ఏం చేసింది?. నా హృదయం కలిచివేస్తుంది. అభిమానం పేరిట నోరు లేని మూగజీవిని బలివ్వడం ఏంటి? ఒకరు కాళ్లు పట్టుకుని లాగుతున్నారు, మరొకరు తలపట్టుకున్నారు. ఇంకొకరు తల నరికేశారు. ఆ తలతో పోస్టర్‌కు అభిషేకం చేశారు జంతు బలి ఎవరూ మెచ్చుకోరు. ఆ నోరులేని మూగజీవి ఆత్మకు శాంతి చేకూరలని కోరుతున్నాను. ఇలాంటివి మళ్లీ పునరావృతంగా కాకుండా ఉండాలని కోరుకుంటున్నాని ఆమె పోస్టు పెట్టారు. ఈ వీడియోలో జంతువులపై జరుగుతున్న ఈ దారుణానికి సంబంధించి పెటాను కూడా ఆమె ట్యాగ్ చేశారు.
ఎన్టీఆర్ హీరోగా, జాన్వీ హీరోయిన్ గా నటించిన దేవర మూవీ రిలీజ్ అయ్యింది. ఈ మూవికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. మరోవైపు జాన్వీకు తెలుగులో ఇది తొలిసి నిమా కావడంతో ఈ మూవీపై మరింత హైప్ క్రియేట్ అయ్యిందని చెప్పుకొవచ్చు. గతంలో కొరాటల శివ , ఎన్టీఆర్ కాంబోలో జనతా గ్యారేజ్ మూవీ వచ్చింది. ఆ తర్వాత మళ్లీ వీరిద్దరు కలసి ఈ సినిమా చేయడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ దీనిపై భారీగానే ఆశలు పెట్టుకున్నారు. అంతే కాకుండా.. ఈ మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కూడా నటించారు. మూవీ విడుదల కావడంతో థియేటర్ లన్ని జాతరను తలపిస్తున్నాయి.