Nana patekar: అభిమానిని కొట్టిన నానా పటేకర్, విమర్షలు రావడంతో.. ఘటనపై వివరణ

Published : Nov 16, 2023, 12:06 PM ISTUpdated : Nov 16, 2023, 01:17 PM IST
Nana patekar: అభిమానిని కొట్టిన నానా పటేకర్, విమర్షలు రావడంతో.. ఘటనపై వివరణ

సారాంశం

అభిమానిపై చేయి చేసుకొని తీవ్ర విమర్శలపాలవుతున్నారు బాలీవుడ్‌ ప్రముఖ నటుడు నానా పటేకర్. ఈ విషయంలో తాజాగా వివరణ ఇచ్చే ప్రయత్నంచేశాడు పటేకర్. సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. 


సినిమా తారలు కనిపిస్తే. .ఒకప్పుడు ఆటోగ్రాఫ్ ల కోసం ఎగబడే వారు.. ఆతరువాత ఫోటోలు.. ఇప్పుడు సెల్ఫీల ట్రెండ్ నడుస్తోంది. సినిమాలు అంటే ఇష్టపడే అభిమానులు ఎవరైనా సనే.. తమకు ఇష్టమైన నటులు కళ్లముందు కనిపిస్తే  ఆనందానికి అవధులు ఉండవు. వారి వద్దకు వెళ్లి ఫొటోలు, సెల్ఫీలు, షేక్‌హ్యాండ్స్, ఆటోగ్రాఫ్స్‌ అంటూ వారి వెంట పడుతుంటారు. కొందరైతే సాహసం చేసి నటుల చుట్టూ ఉన్న సెక్యూరిటీని దాటుకుని మరీ వెళ్లి మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాంటి అభిమానికి అవమానం జరిగింది బాలీవుడ్ నటుడి వలన.  

బాలీవుడ్ ను ఇరకాటంలో పెట్టిన దీపికా పదుకునే, షాకింగ్ కామెంట్స్ చేసిన బ్యూటీ

సెల్ఫీ  కోసం వచ్చిన ఓ అభిమానిపై చేయి చేసుకొని, తలపై కొట్టి పంపించాడు బాలీవుడ్ స్టార్ నటుడు నానా పటేకర్. ది వ్యాక్సిన్‌ వార్‌’తో ప్రేక్షకుల్ని అలరించిన ఆయన ఇప్పుడు తన తదుపరి సినిమా షూటింగ్ కోసం వారణాసి వచ్చాడు.. ఈషూటింగ్ పనుల్లో  బిజీగా ఉన్నాడు. సరిగ్గా అదేటైమ్ లో ఓ అభిమాని సెల్ఫీ కావాలని వచ్చాడు. వచ్చిన వ్యక్తిపై అసహనం వ్యక్తం చేయడంతో పాటు..తలపై  కొట్టి నెట్టేశారు. దాంతో నానా పటేకర్ పై తీవ్ర  విమర్శలు వచ్పాచాయి.   ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. నెటిజన్లు నానా పటేకర్ ను రకరకాలుగా విమర్షిస్తున్నారు. 

 

ఈ వీడియో చూసిన నెటిజన్లు నటుడి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఘటనపై చివరికి నానా పటేకర్‌ స్పందించారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. ఆయన ఏమన్నారంటేు.. ఇది ఈ సినిమా సీక్వెన్స్ సీన్‌లో భాగమే. మొదట ఓ రిహార్సెల్ చేశాము. రెండోది చేయాల్సి ఉంది. డైరెక్టర్ ప్రారంభించమన్నారు. మేము మొదలెట్టే సమయానికి ఆ కుర్రాడు వచ్చాడు. అతడెవరో నాకు తెలీదు. అతడు మా సిబ్బందిలో ఒకడని అనుకున్నా. కాబట్టి, సీన్ ప్రకారం అతడిని కొట్టి, వెళ్లిపొమ్మని చెప్పా. కానీ, అతడు బయటవాడని ఆ తరువాత తెలిసింది అన్నాడు నానా పటేకర్.

అయితే అసలు విషయం తెలిసి .. ఆ  కుర్రాడిని వెనక్కు పిలిపించే లోపే అతడు వెళ్లిపోయాడు. బహుశా ఇదంతా అతడి స్నేహితుడు రికార్డ్ చేసినట్టున్నాడు.  ఫొటోల కోసం వచ్చే వారిని నేనెప్పుడూ కాదనలేదు. పొరపాటున ఇలా జరిగింది. నన్ను క్షమించండి. ఇలాంటి పని నేను ఎప్పుడూ చేయను  అని  వీడియోలో వివరణ ఇచ్చారు నానా పటేకర్. 

PREV
Read more Articles on
click me!