Namrata : మహేశ్ బాబు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటో చెప్పిన నమత్రా.. సినిమాల్లోకి రీఎంట్రీ?పైనా కామెంట్స్

Published : Aug 17, 2023, 08:20 PM ISTUpdated : Aug 17, 2023, 08:21 PM IST
Namrata : మహేశ్ బాబు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటో చెప్పిన నమత్రా.. సినిమాల్లోకి రీఎంట్రీ?పైనా కామెంట్స్

సారాంశం

మహేశ్ బాబు సతీమణి, సీనియర్ నటి నమ్రతా శిరోద్కర్ కామెంట్స్ కొన్ని నెట్టింట వైరల్ గా మారాయి. తన పర్సనల్ లైఫ్ గురించి, ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఎదురైన ప్రశ్నలకు ఆమె  ఆసక్తికరంగా బదులిచ్చారు.   

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu)  - నమ్రతా శిరోద్కర్ (Namrata Shirodkar)   తమ మ్యారీడ్ లైఫ్ లో ఎంత అన్యోన్యంగా ఉంటున్నారో తెలిసిందే. ఎప్పుడూ సంతోషంగా కనిపిస్తూ ఉంటారు. తమ ప్రేమాభిమానాలతో ఆదర్శవంతంగానూ నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. నమత్రా - మహేశ్ లా పెళ్లి జరిగి 18 గడిచిన విషయం తెలిసిందే. ఆ మధ్యలో వీరి మ్యారేజ్ డేనూ గ్రాండ్ గానే సెలబ్రేట్ చేసుకున్నారు.

2000లో వచ్చి న వంశీ చిత్రంతో వీరిద్దరూ ఒక్కటయ్యారని, 2005 వరకు ప్రేమలో మునిగి తేలిన  మహేశ్ - నమత్రా శిరోద్కర్ కు ముంబైలో పెద్దల సమక్షంలోనే పెళ్లి జరిగిందనే విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ జ్యూయెల్లరీ ఓపెనింగ్ కు వచ్చిన నమ్రతా మహేశ్ తనికిచ్చిన ఫస్ట్ గిఫ్ట్ గురించి చెప్పింది. మహేశ్ తనకిచ్చిన మొట్టమొదటి బహుబతి వెడింగ్ రింగ్ అని చెప్పుకొచ్చింది. 

అయితే తనకు నగలపై పెద్దగా ఆసక్తి ఉండదని చెప్పింది. సింపుల్ గానే ఉండేందుకు ఇష్టపడుతానని తెలిపింది. షాపింగ్ సైతం పెద్దగా వెళ్లలనని చెప్పారు. అయితే ఆమె తల్లి తనకు ఎనిమిదేళ్ల వయస్సు ఉండగా ఇచ్చిన సాయిబాబా బంగారు ఉంగరం అంటే చాలా ఇష్టమని తెలిపారు. అది ఇప్పటికీ తనవెంటనే ఉంటుందని చెప్పారు. పోతే మహేశ్ బాబుతో కలిసి నటించే ఛాన్స్ ఉందా? అనే ప్రశ్నకు బదులిచ్చింది.

తనకు సినిమాల్లోకి రావాలనే ఉద్దేశం లేదని గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా అదే ప్రశ్న మళ్లీ ఎదురవడంతో.. రీఎంట్రీ ఇవ్వనున్నానంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని మరోసారి స్పష్టం చేశారు. చివరిగా 2004లో వచ్చిన ’అంజి’తో పాటు రెండు, మూడు హిందీ, ఇంగ్లీష్  చిత్రాల్లో మెరిసింది. 23 ఏళ్లుగా నటనరంగానికి దూరంగా ఉంది. కానీ ప్రొడ్యూసర్ గా మాత్రం గతేడాది ‘మేజర్’ సినిమాను ప్రేక్షకులకు అందించిన విషయం తెలిసిందే. ఇక తమ వ్యాపారాలు, పిల్లలు సితారా, గౌతమ్ లను చూసుకుంటోంది.

PREV
click me!

Recommended Stories

BMW Teaser: 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ రివ్యూ.. వరుస డిజాస్టర్లతో రూటు మార్చిన రవితేజ, రొమాన్స్ షురూ
Missterious Review: 'మిస్‌టీరియస్' మూవీ రివ్యూ.. ట్రైయాంగిల్ లవ్ స్టోరీలో మిస్టరీ ఆకట్టుకుందా, తేలిపోయిందా ?