రెండు లక్షలు ఇచ్చినా జబర్దస్త్ కి వెళ్లను.. జోష్ రవి షాకింగ్ కామెంట్స్ 

Published : Aug 17, 2023, 05:40 PM IST
రెండు లక్షలు ఇచ్చినా జబర్దస్త్ కి వెళ్లను.. జోష్ రవి షాకింగ్ కామెంట్స్ 

సారాంశం

జోష్ రవి జబర్దస్త్ షోని ఉద్దేశించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. రెండు లక్షలు ఇచ్చినా ఆ షోకి నేను వెళ్లనంటూ కుండబద్దలు కొట్టాడు.   

ఇటీవల జోష్ రవి దయ వెబ్ సిరీస్లో కీలక రోల్ చేశాడు. ప్రధాన పాత్ర చేసిన జేడీ చక్రవర్తి అసిస్టెంట్ గా నటించాడు. దయ వెబ్ సిరీస్ మంచి ఆదరణ దక్కించుకుంది. తాజాగా జోష్ రవి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆసక్తికర కామెంట్స్ చేశాడు. నేను వందకు పైగా చిత్రాల్లో నటించాను. అయితే పేరు తెచ్చింది మాత్రం 20 చిత్రాలే. నా మొదటి చిత్రం మగధీర. అయితే జోష్ మూవీలో నిడివి ఉన్న పాత్ర చేశాను. దాంతో జోష్ రవిగా పేరొచ్చింది. 

గుండెజారి గల్లంతయ్యిందే చిత్రం కూడా నాకు ఫేమ్ తెచ్చింది. ఒక దశలో వరుసగా గే పాత్రలు వచ్చాయి. దాంతో కొన్ని సినిమాలు వదిలేశాను. నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్ అసిస్టెంట్ గా నేను చేయాల్సింది. కొందరు ఎదిగేందుకు నా గురించి తప్పుగా చెప్పి ఆ పాత్ర నాకు దూరం చేశారు. ఈ విషయం సుకుమార్, నాకు తర్వాత తెలిసింది. 

జబర్దస్త్ షోకి రెండు మూడు సార్లు గెస్ట్ గా వెళ్ళాను. వాళ్ళు నాకు జస్ట్ రూ. 2 వేలు ఇచ్చేవారు. కానీ రెండు లక్షలు ఇచ్చినా జబర్దస్త్ షో చేయను. ఎందుకంటే నేను సినిమానే నమ్ముకున్నాను. సినిమాల్లోనే నటిస్తాను. గెస్ట్ గారు రమ్మంటే వెళతాను. జబర్దస్త్ ఫుల్ టైం చేయమంటే చేయను. కొన్నాళ్లుగా కనీస సంపాదన లేక ఆకలితో అలమటించాను అని జోష్ రవి చెప్పుకొచ్చాడు. దయ సక్సెస్ నేపథ్యంలో జోష్ రవికి ఆఫర్స్ వచ్చే సూచనలు కలవు. 
 

PREV
click me!

Recommended Stories

నాగార్జున ఫ్లాప్ మూవీ గురించి చెప్పిన డైరెక్టర్, నయనతారకి సర్ప్రైజ్.. అందుకే చిరంజీవి సినిమాకి ఒప్పుకుందా
Suriya: కంగువతో విమర్శలు, హ్యాట్రిక్ హిట్లు కొట్టేందుకు ప్లాన్.. సూర్య చేస్తున్న 3 సినిమాలు ఇవే