
గతకొంతకాలంగా సౌత్ బొద్దుగుమ్మ నమిత పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో షికారు చేసిన సంగతి తెలిసిందే. సీనియర్ నటుడు శరత్ బాబును నమిత పెళ్లి చేసుకోబోతోందని, అతనితోనే సహజీవనం చేస్తోందని రకరకాల వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. వాటన్నింటికి చెప్ పెడుతూ నమిత పెళ్లి తేదీని ప్రకటించి షాకిచ్చింది.
సొంతం సినిమాతో వెండితెరకు పరిచయమైంది నార్త్ బ్యూటీ నమిత. ఉన్నట్టుండి ఓ తమిళ నటుడిని పెళ్లి చేసుకోబోతున్నానంటూ నమిత అనౌన్స్ చేసి అందరికీ షాకిచ్చింది. తమిళ నటుడు వీరాతో ఈనెల 24న తన వివాహం జరగనుందని నమిత స్వయంగా చెప్పింది. తమిళ బిగ్ బాస్ ప్రోగ్రాం కంటెస్టెంట్లు రజియా విల్సన్ మరికొందరు కలిసి సోషల్ మీడియాలో ఓ సూపర్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నామంటూ వీడియో మెసేజ్ ద్వారా అభిమానులందరికీ నమిత పెళ్లి సంగతి తెలియజేశారు.
ఆ వీడియోలో తన బాయ్ ఫ్రెండ్.. ఉడ్ బీతో కలిసి కనిపించిన నమిత తన సొట్టబుగ్గల నవ్వులతో ఆనందంగా మాట్లాడింది. నవంబర్ 24న వీరాతో తన పెళ్లి జరగనుందని.. మీ అందరి ప్రేమాభిమానాలు తనకెప్పుడూ ఉండాలని కోరుకుంది. నమిత పెళ్లి చేసుకోబోతున్న వీరా తమిళంలో చిన్నాచితకా పాత్రలు చేస్తుంటాడు. వీళ్లిద్దరూ కలిసి మియా అనే థ్రిల్లర్ ఫిలింలో నటించారు.
నమిత పరిచయమైంది.. పేరు తెచ్చుకుంది తెలుగు తెరపైనే అయినా ఇక్కడ ఆమెకు చెప్పుకోదగిన అవకాశాలు ఒకటి రెండు మాత్రమే వచ్చాయి. భారీ అందాలకు పెద్దపీట వేసే కోలీవుడ్ వెల్ కం చెప్పడంతో పెట్టెబేడా సర్దుకుని చెన్నైకి షిఫ్టయిపోయింది. అక్కడ అభిమానులు గుడికట్టే రేంజికి నమితను ఆదరించారంటే అర్థం చేసుకోవచ్చు. చివరకు తమిళనాడులోనే తన లైఫ్ పార్టనర్ ను వెతుక్కుని అక్కడే సెటిలయిపోతోంది.