తెలుగులో మళ్లీ కనువిందు చేయనున్న బొద్దుగుమ్మ

Published : Dec 27, 2016, 11:09 AM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
తెలుగులో మళ్లీ కనువిందు చేయనున్న బొద్దుగుమ్మ

సారాంశం

తెలుగులో తిరిగి నటించనున్న నమిత గుంటూరు టాకీస్ సీక్వెల్ లో మెరవనున్న బొద్దుగుమ్మ

శృంగార రసం ఒలికించి ఒలికించి ప్రేక్షకుల ఆరాధ్య దైవంగా మారిన తార నమిత. ఈ బొద్దుగుమ్మ ఇటీవల మరింత బొద్దుగా తయారైంది. అయితే తాజాగా ఓ హాట్ రోల్ ఆమెను వరించటంతో చక్కనమ్మ చిక్కేందుకు రెడీ అవుతోంది.

ఆర్‌.కె.స్టూడియోస్‌ అధినేత రాజ్‌కుమార్‌.ఎం నిర్మాణ సారథ్యంలో రూపొందిన గుంటూరు టాకీస్ మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆర్‌.కె.స్టూడియోస్ రాజ్‌కుమార్‌.ఎం ద‌ర్శ‌క నిర్మాణంలో గుంటూరు టాకీస్ సీక్వెల్ గుంటూరు టాకీస్ 2 ప్రారంభ‌మైంది. అయితే సీనియ‌ర్ న‌రేష్ మిన‌హా ఈ సీక్వెల్‌లో న‌టీన‌టులంద‌రూ మారిపోయారు.

బాలీవుడ్ సెక్సీస్టార్ స‌న్నిలియోన్ ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంది.  తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రంలో నికిషా ప‌టేల్ ఓ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా మ‌రో హీరోయిన్‌గా న‌మిత న‌టించ‌నుంది. ప్ర‌స్తుతం న‌మిత‌తో చ‌ర్చ‌లు జ‌రుగుఉతున్నాయి. సింహా త‌ర్వాత న‌మిత మ‌రో తెలుగు సినిమాలో న‌టించ‌లేదు. బొద్దుగా ఉన్న న‌మిత ఇప్పుడు స్లిమ్‌గా త‌యార‌వుతోందని తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

The Raja Saab కథ లీక్‌ చేసిన ప్రభాస్‌, హైలైట్‌ ఇదే.. తాను పనిచేసిన డైరెక్టర్స్ గురించి క్రేజీ వర్డ్స్
Prabhas: పెళ్లి ఎందుకు చేసుకోలేదో చెప్పిన ప్రభాస్‌, ఎవరూ ఊహించరు.. `స్పిరిట్‌` లుక్‌ మైండ్‌ బ్లోయింగ్‌