
సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న మెగా స్టార్ 150 వ చిత్రం ఖైదీ నంబర్ 150. ఈ చిత్రంలోని కుమ్ముడు సాంగ్ ఇటీవలే రిలీజైన సంగతి తెలిసిందే. రిలీజైంది కదా ఇంకేంటి అంటే... అక్కడే ఉంది అసలు మేటర్. మెగా స్టార్ స్టామినా ఏ మాత్రం తగ్గకపోగా పెరిగిందనటానికి ఈ సాంగ్ క్రియేట్ చేస్తున్న రికార్డ్సే నిదర్శనం.
మెగా స్టార్ ఖైదీ నెం.150 విడుదలకు ముందే సంచలనాలకు కేంద్రంగా మారుతోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమాలోని మొదటి ' అమ్మడు-కుమ్ముడు' పాట అప్రతిహతంగా దూసుకుపోతోంది. యూ ట్యూబ్ లో రికార్డులను బద్దలు కొడుతోంది. తాజాగా 60 లక్షల (6 మిలియన్ల) హిట్లను సాధించింది. ఈ మేరకు లహరి మ్యూజిక్ అధికారిక ట్విట్టర్ లో తన సంతోషాన్ని షేర్ చేసింది. కుమ్ముడు అంటే ఇదే.. ఒక వారంలో 60 లక్షల వ్యూస్ అంటూ ట్వీట్ చేసి అనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతోంది లహరి సంస్థ.
మరోవైపు ఈ మూవీలోని మూడవ పాటను విడుదలచేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. లహరి ట్వీట్ ను రీ ట్వీట్ చేసిన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ మెగా వార్త అందించారు. మెలోడీ సాంగ్ గా మెగా అభిమానులకు సంతోషాన్ని పంచనున్న ఈ పాట డిసెంబర్ 28 సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయనున్నట్టు ట్విట్టర్ ద్వారా సమాచారం అందించారు. ద మెలోడీ ఆఫ్ ద మౌసం అంటూ ట్వీట్ చేశారు.