హిందూ మనోభావాలను దెబ్బతీయలేదు- నాకు నేనే తోపుతురుమ్ నిర్మాత ధృవ కుమార్

Published : Jul 29, 2017, 09:31 PM ISTUpdated : Mar 25, 2018, 11:41 PM IST
హిందూ మనోభావాలను దెబ్బతీయలేదు- నాకు నేనే తోపుతురుమ్ నిర్మాత ధృవ కుమార్

సారాంశం

ధృవ క్రియేషన్స్ పతాకంపై జి. శివమణి దర్శకత్వంలో  'నాకు నేనే తోపు తురుమ్' అశోక్ కుమార్, మానస జంటగా నటించిన చిత్రం   'నాకు నేనే తోపు తురుమ్' ఈ చిత్రంలో హిందూ మనోభావాలను దెబ్బతీయలేదన్న నిర్మాత ధృవ కుమార్

ధృవ క్రియేషన్స్ పతాకంపై అశోక్ కుమార్, మానస జంటగా నటించిన చిత్రం 'నాకు నేనే తోపు తురుమ్'. దర్శకుడు జి. శివమణి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ శుక్రవారం సినిమా విడుదలవుతోంది. ఈ చిత్రంలో హిందూ మతాన్ని కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయి అంటూ హిందూ జనశక్తి సంస్థ చెప్పింది. అయితే తమకు ఏ మతాన్ని కించపరిచే ఉద్దేశం లేదని చిత్ర నిర్మాత ధృవ కుమార్ తెలిపారు. అలా భావించిన వారికి క్షమాపణలు చెప్పారు.

 

నిర్మాత ధృవ కుమార్ మాట్లాడుతూ ...''హిందూ మతం అంటే మాకు అపారమైన గౌరవం ఉంది. ఏ మతాన్ని కించపరిచేలా సినిమా ఉండదు. ప్రస్తుతం సమాజంలో ప్రతి ఒక్కరూ స్వార్ధంతో బతుకుతున్నారు. ధర్మం అనేది లేకుండా పోయింది అనే విషయాన్ని కొంత అగ్రెసివ్ గా చెబుతూ ప్రచారం చేశాం. మాకు తెలియకుండానే ఎవరైనా నొప్పిస్తే క్షమాపణ కోరుతున్నాను. ఈ విషయం మా దృష్టికి తీసుకుని వచ్చిన హిందూ జనశక్తి సంస్థకు, సంస్థ అధ్యక్షుడు లలిత్ కుమార్, ఇతర సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా