నగ్మా రీఎంట్రీ.. అల్లు అర్జున్ కి తల్లిగా..!

Published : Feb 19, 2019, 11:22 AM IST
నగ్మా రీఎంట్రీ..  అల్లు అర్జున్ కి తల్లిగా..!

సారాంశం

ఒకప్పుడు అగ్రహీరోల సరసన నటించి టాలీవుడ్ ని షేక్ చేసిన నటి నగ్మా.. ఆ తరువాత రాజకీయాల్లోకి వెళ్లి బిజీ అయిపోయింది.ఇప్పుడు మరోసారి టాలీవుడ్ లో రీఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది. 

ఒకప్పుడు అగ్రహీరోల సరసన నటించి టాలీవుడ్ ని షేక్ చేసిన నటి నగ్మా.. ఆ తరువాత రాజకీయాల్లోకి వెళ్లి బిజీ అయిపోయింది.ఇప్పుడు మరోసారి టాలీవుడ్ లో రీఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది.

ఇప్పటికే సీనియర్ హీరోయిన్లు నదియా, మీనా, రమ్యకృష్ణ వంటి వారు తల్లి పాత్రల్లో నటిస్తూ తమ సత్తా చాటుతున్నారు. ఇప్పుడు నగ్మా కూడా ఈ లిస్ట్ లోకి చేరబోతుంది. గ్లామరస్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్న నగ్మా ఇప్పుడు స్టార్ హీరోకి తల్లిగా నటించడానికి సిద్ధమవుతోంది.

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో బన్నీకి తల్లిగా నగ్మాని తీసుకోవాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు.

దానికి ఆమె కూడా సముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి తెరపై నగ్మా పాత్రను ఎంత పవర్ ఫుల్ గా చూపించబోతున్నాడో.. తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే!

PREV
click me!

Recommended Stories

Rajinikanth MGR: రజినీ జీవితాన్ని మార్చేసిన ఎంజీఆర్ 'మాస్టర్ ప్లాన్'! ఆ స్టైల్ ఎందుకంత నచ్చలేదంటే?
Zero Flop Record: ఫ్లాప్ ఎరుగని హీరో.. చేసిన 3 సినిమాలు బ్లాక్‌బస్టర్.. ఎవరో తెలుసా?